ఐఎన్ఎస్ విక్రాంత్ పై రఫేల్ ఫైటర్ జెట్ చరిత్ర…వణుకుతున్న పాకిస్థాన్, చైనా

మాములుగా నేల మీద రెండు మూడు కిలోమీటర్ల పొడవైన రన్ వే పై ఒక ఫైటర్ జెట్ ల్యాండ్ అవ్వడానికి.. సముద్రంలో కదులుతున్న ఒక నౌకపై, అదీ కేవలం 200 మీటర్ల రన్ వే పై ల్యాండ్ అవ్వడానికి చాలా తేడా ఉంటుంది. దానికి విమానం డిజైన్, బరువు, ఆగిపోయే వేగం అన్నీ పర్ఫెక్ట్ గా కుదరాలి. పైలట్ కు అత్యుత్తమ నైపుణ్యం ఉండాలి. ప్రస్తుతం భారత నౌకాదళం గోవాలో ఉన్న నావల్ బేస్ నుంచి ఈ రఫేల్ మెరైన్ విమానాలతో విస్తృతమైన ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కార్యకలాపాలు సాగించడానికి ఈ విమానాలకు అవసరమైన సాంకేతిక మార్పులను అంచనా వేయడం, వాటి అనుకూలతను నిర్ధారించుకోవడం కోసమే ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగానే పైలట్లు అత్యంత కచ్చితత్వంతో రఫేల్ జెట్ ను ఏమాత్రం పొరపాటు జరగకుండా విక్రాంత్ డెక్ పై ఈ విజయవంతమైన ల్యాండింగ్ చేశారు.
మన వైమానిక దళం వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటి దెబ్బకు చైనా ఇప్పటికే వణికిపోతోంది. కానీ నేవీ వద్ద పాతబడిపోతున్న రష్యన్ మిగ్-29కె విమానాల స్థానంలో అత్యాధునికమైన ట్విన్-ఇంజిన్ మెరైన్ విమానాలు కావాలని నేవీ ఎప్పటినుంచో అడుగుతోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన F-18 సూపర్ హార్నెట్ ను వెనక్కి నెట్టి, ఎన్నో కఠినమైన పరీక్షల తర్వాత ఫ్రాన్స్ కు చెందిన రఫేల్ ఫైనల్ గా సెలెక్ట్ అయింది.
భారత నౌకాదళం కోసం 26 రఫేల్ మెరైన్ విమానాల కొనుగోలుకు భారత్, ఫ్రాన్స్ మధ్య 2025 ఏప్రిల్ 28న సుమారు 63వేల కోట్ల విలువైన భారీ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా 22 సింగిల్-సీట్ ఫైటర్ జెట్లు , 4 ట్విన్-సీట్ శిక్షణా విమానాలు భారత్కు అందనున్నాయి. ఈ విమానాలతో పాటు అత్యంత ప్రమాదకరమైన ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్ , యాంటీ-షిప్ ఆయుధాలు, సిమ్యులేటర్లు, లాజిస్టిక్స్ కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తోందని, 2030 నాటికి ఈ 26 విమానాల డెలివరీలు పూర్తికానున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.



