పాక్ మెడలు వంచిన భారత్..సిగ్గులేకుండా దొడ్డిదారిన పాక్ చీకటి వ్యాపారం

గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్‌తో అన్ని రకాల దౌత్య సంబంధాలను తెంచుకున్న భారత్.. వారితో ప్రత్యక్ష వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. భారత్ దెబ్బకు గత్యంతరం లేక, తమ పరువు కాపాడుకోవడానికి పాకిస్థాన్ కూడా భారత్ నుంచి దిగుమతులపై నిషేధం విధించినట్లు ప్రకటించుకుంది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. పేపర్ల మీద, టీవీల్లో బ్యాన్ అని చెబుతున్న పాకిస్థాన్.. క్షేత్రస్థాయిలో మాత్రం భారతీయ వస్తువులు లేకుండా రోజు గడపలేని స్థితికి చేరుకుంది. పాక్ దేశ మార్కెట్లో మన వస్తువులకు గిరాకీ ఏమాత్రం తగ్గలేదు సరికదా, మరింత పెరిగింది. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఏకంగా 586 కోట్ల విలువైన భారత ఉత్పత్తులు పాకిస్థాన్‌కు చేరడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పాకిస్థాన్ ప్రముఖ పత్రిక డాన్ తాజాగా 2026-27 జులై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించిన పాక్ వాణిజ్య లోటుపై ఒక సంచలన కథనం పబ్లిష్ చేసింది. ఈ కథనం పాక్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. ఈ త్రైమాసికంలో 61.74 మిలియన్ డాలర్ల అంటే భారత కరెన్సీలో దాదాపు 586 కోట్ల రూపాయల విలువైన భారత ఉత్పత్తులను పాకిస్థాన్ దిగుమతి చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ దిగుమతుల విలువ ఏకంగా 69 శాతం అధికం కావడం గమనార్హం.
2025-26 ఆర్థిక సంవత్సరంలో పాక్‌కు భారత వస్తువుల దిగుమతుల విలువ కేవలం 36.55 మిలియన్ డాలర్లుగా ఇండియన్ కరెన్సీలో దాదాపు 346 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. అంటే మన దేశం కఠిన ఆంక్షలు విధించిన కొద్దీ, మన వస్తువులపై పాకిస్థాన్ కు డిపెండెన్సీ మరింత పెరుగుతోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన, గర్వించదగ్గ విషయం ఏంటంటే.. ఇదే జులై-సెప్టెంబరు మధ్య కాలంలో పాకిస్థాన్ నుంచి భారతదేశానికి ఎలాంటి ఎగుమతులు జరగలేదు. అంటే ట్రేడ్ బ్యాలెన్స్ పూర్తిగా ఒకవైపు మాత్రమే ఉంది. పాక్ కు మన వస్తువులు అవసరం కానీ, పాక్ వస్తువులతో మనకు ఎలాంటి అవసరం లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.



