గ్రీస్ లో అనిరుధ్ ..కావ్య ల డెస్టినేషన్ వెడ్డింగ్.. కాబోయే మామా అదిరిపోయే గిఫ్ట్..?
కామెంట్లు (0)

తన మ్యూజిక్ తో కుర్రకారును ఊపేస్తున్న యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ , సన్ గ్రూప్ వారసురాలు, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో, ఐపీఎల్ లో ఎస్.ఆర్.హెచ్ ఓనర్ కావ్య మారన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ వార్త ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్లు స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, తమ కూతురు వివాహానికి ఆహ్వానించడంతో వీరి పెళ్లిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
అనిరుధ్ , కావ్య మారన్.. ఇద్దరూ తమ తమ రంగాల్లో టాప్ పొజిషన్లో ఉన్నవాళ్లే. అనిరుధ్ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస బ్లాక్‌బస్టర్స్ ఇస్తూ ప్యాన్ ఇండియా రేంజ్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు కావ్య మారన్.. సన్ నెట్వర్క్ బాధ్యతలతో పాటు, సన్‌రైజర్స్ హైదరాబాద్, అలాగే సౌత్ ఆఫ్రికా లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లను ముందుండి నడిపిస్తున్న పవర్ ఫుల్ లేడీ బాస్. తాజా సమాచారం ప్రకారం వీరి పెళ్లి చాలా గ్రాండ్‌గా, రాయల్‌గా జరగబోతోంది. నవంబర్ 11న యూరప్‌లోని గ్రీస్ దేశంలో, అత్యంత కొద్దిమంది కుటుంబసభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నై వేదికగా సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రులు, సినిమా సూపర్ స్టార్లు, క్రికెటర్లతో ఈ రిసెప్షన్ కనీవినీ ఎరుగని రీతిలో జరగబోతోందని కోలీవుడ్ వర్గాల టాక్.



