జీవీ ప్రకాశ్కు.. రెహమాన్ కాల్..ఆ భారీ ప్రాజెక్టు కోసమే
కామెంట్లు (0)

భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న భారీ చిత్రం రామాయణ . అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ విజువల్స్తో రూపొందుతున్న ఈ సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లో జీవీ ప్రకాశ్ కుమార్ ఎంటర్ అయ్యాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవీ ప్రకాశ్ కుమార్.. రామాయణ సినిమాలో తానెలా భాగమయ్యాననే ఆసక్తికరమైన విషయాన్ని స్వయంగా పంచుకున్నారు.
జీవీ ప్రకాశ్ రీసెంట్గా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు. అక్కడ దర్శనం ముగించుకుని ఇంటికి వస్తుండగా.. రెహ్మాన్ నుండి ఫోన్ వచ్చింది. ఒక అద్భుతమైన పాట ఉంది, వెంటనే వచ్చి రికార్డింగ్ చేయాలి అని అడిగారు. అది రామాయణ కోసం. ఈ విషయం వినగానే జీవీ ప్రకాశ్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. నేను అయోధ్య నుంచి రాముడి దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన వెంటనే, అదే రాముడి గాథ రామాయణ చిత్రం కోసం ఓ అద్భుతమైన పాటను రికార్డ్ చేయడం.. నిజంగా ఇదొక నమ్మశక్యం కాని అనుభూతి అని జీవీ ఎమోషనల్ అయ్యాడు. ఏఆర్ రెహమాన్ కు జీవీ ప్రకాశ్ స్వయానా మేనల్లుడు అన్న విషయం చాలా మందికి తెలుసు. గతంలో రెహమాన్ సంగీతంలో జీవీ పలు సూపర్ హిట్ పాటలు పాడారు. కానీ చాలా కాలం తర్వాత.. అదీ ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగిన తర్వాత.. మళ్లీ తన మావయ్య రెహమాన్ ఆధ్వర్యంలో రామాయణ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో పాట పాడే అవకాశం రావడం చాలా స్పెషల్. దీని వెనుక మరో ఇంట్రెస్టింగ్ కనెక్షన్ కూడా ఉంది. ఇటీవల రవితేజ నటించిన చిత్రం ఇరుముడి కి జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ఆ చిత్రంలో ఆయన సమకూర్చిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమాలో హన్స్ జిమ్మెర్ ఇంటర్నేషనల్ ఆర్కెస్ట్రేషన్ చూసుకుంటుంటే, ఏఆర్ రెహమాన్ భారతీయ ఫీల్ మిస్ కాకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ టీమ్లో జీవీ ప్రకాశ్ వాయిస్ కూడా తోడవడంతో సినీ ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఆ పాట కచ్చితంగా గూస్బంప్స్ తెప్పించడం గ్యారెంటీ అని మ్యూజిక్ లవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.నితీష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రామాయణ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను కేవలం ఇండియన్ ఆడియన్స్ కోసమే కాకుండా, గ్లోబల్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా విఎఫ్ఎక్స్, సెట్స్, మ్యూజిక్ అన్నీ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందిస్తున్నారు.ఇందులో సన్నీ డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ లాంటి స్టార్లు కూడా నటిస్తున్నారు.



