ఫౌజీ హీరోయిన్ బర్త్ డే..ప్రభాస్ సర్ప్రైజ్ ట్రీట్..వామ్మో..ఇన్ని వెరైటీలా!
కామెంట్లు (0)

ఆతిథ్యం ఇవ్వడంలో పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన డార్లింగ్ ప్రభాస్ శైలే ప్రత్యేకం. ఆయన హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ఫౌజీ. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వి బర్త్ డే తాజాగా జరిగింది. తన బర్త్‌డేను చాలా సింపుల్‌గా జరుపుకున్న ఈ బ్యూటీకి , ప్రభాస్ ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకాన్ని అందించారు. కేవలం సాధారణ బహుమతితో సరిపెట్టకుండా, తన మార్క్ ఆతిథ్యంతో రకరకాల నాన్‌వెజ్ వంటకాలతో కూడిన ఒక స్పెషల్ విందు భోజనాన్ని ఆమెకు పంపించారు.ఇక ప్రభాస్ ఇచ్చిన ఈ ఊహించని సర్ప్రైజ్కు ఇమాన్వి ఫిదా అయిపోయింది. ఆ ఫుడ్ తింటున్న ఫొటోలు , వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. బాలీవుడ్ , కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా సరే.. ఆ హీరో పక్కన నటించడానికి స్టార్స్ అంతా ఎగబడుతుంటారు. ప్రభాస్ మంచి భోజన ప్రియుడన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన తినడమే కాదు, ఆయనతో పాటు పనిచేసే డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఇలా సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ స్వయంగా తన ఇంటి నుంచి క్యారేజీలు తెప్పించి, వడ్డించి మరీ తినిపిస్తుంటాడు. ప్రభాస్ ఆతిథ్యం రుచి చూసిన ఎంతో మంది స్టార్లు ఆయన గొప్పతనాన్ని ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ పుట్టినరోజు సందర్భంగా.. డార్లింగ్ ఆమెకు ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. టేబుల్ పట్టనన్ని వెరైటీలతో ప్రభాస్ పంపిన ఫుడ్ చూసి ఇమాన్వీ ఆశ్చర్యపోయింది. సాధారణంగా ప్రభాస్ ఏ హీరోయిన్‌తో పని చేసినా, వాళ్లకు ఫుడ్ ట్రీట్ ఇవ్వడం ఆయనకు అలవాటు. శృతి హాసన్, దిశా పటాని, కృతి సనన్, దీపికా పదుకొణె, మాళవికా మోహనన్.. ఇలా ప్రతి ఒక్కరూ ప్రభాస్ ఇంటి భోజనం తిని వావ్ అన్నవాళ్లే. ఇప్పుడు ఇమాన్వీ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ తన దైన స్టైల్లో ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చాడు. ఏకంగా తన ఇంటి నుంచి తన పర్సనల్ షెఫ్‌లతో వండించిన రకరకాల వెరైటీ వంటకాలను పంపించాడు. అందులో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో నాన్ వెజ్ వెరైటీలు ఉన్నాయి. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీస్, రొయ్యల ఇగురు, చేపల పులుసు, రకరకాల ఫ్రైడ్ ఐటమ్స్.. వాటితో పాటు రకరకాల ట్రెడిషనల్ స్వీట్స్, డెజర్ట్స్, వెజ్ కర్రీస్.. ఇలా ఒక పెళ్లి భోజనాన్ని తలపించేలా లావిష్ ఫీస్ట్‌ను ఇమాన్వీ కోసం ఏర్పాటు చేశాడు ప్రభాస్. ఆ టేబుల్ మీద ఉన్న ఐటెమ్స్ చూస్తే ఎవరికైనా సరే నోరూరాల్సిందే. తన బర్త్ డే కి ప్రభాస్ ఇంత స్పెషల్‌గా ఫుడ్ పంపించడంతో ఇమాన్వీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఆ ఫుడ్ టేబుల్ అంతా ఒక చిన్న వీడియో, ఫోటోస్ తీసి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.



