బలగం మ్యాజిక్ రిపీట్..ఇడుపు కాయితం విడుదల అప్పుడే..!

హాస్యనటుడిగా ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి . బలగం, సేవ్ ద టైగర్స్ లాంటి బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్ తర్వాత దర్శి హీరోగా నటిస్తున్న మరో అద్భుతమైన విలేజ్ ఫ్యామిలీ డ్రామా ఇడుపు కాయితం. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. గతంలో టైటిల్ ప్రకటనతోనే వార్తల్లో నిలిచిన ఈ మూవీ నుంచి, తాజాగా మేకర్స్ గడప పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు నెట్టింట్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో, బన్నీ వాస్ ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. రెండు ఆత్మల ప్రయాణం, ఎన్నో కుటుంబ అనుభూతులు, జీవితకాలపు మధుర జ్ఞాపకాలు అంటూ హృదయాలను హత్తుకునే క్యాప్షన్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.టైటిల్ ప్రకటనతోనే వార్తల్లో నిలిచిన ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబరు 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో చిత్ర బృందం గడప పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఈ పాట సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట ప్రస్తుతం సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. బలగం, విరాటపర్వం సినిమాలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఈ జానపద బాణీకి ఆయన ఇచ్చిన ట్యూన్ మ్యూజిక్ లవర్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది. అభినయ శ్రీనివాస్ అందించిన సాహిత్యం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉండగా, ప్రముఖ ఫోక్ సింగర్ తేలు విజయ ఈ పాటకు ప్రాణం పోశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని, డిసెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాను సరైన ప్రమోషన్స్ తో థియేటర్లలోకి తీసుకొస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని బలగం, దసరా లాంటి సినిమాలు నిరూపించాయి.
ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా నటిస్తున్న హీరోయిన్ గురించి మనం కచ్చితంగా మాట్లాడుకోవాలి. కమర్షియల్ సినిమాల్లో లాగా గ్లామర్ డాల్స్ ను కాకుండా, పక్కా పల్లెటూరి అమ్మాయిలా కనిపించే నాచురల్ టాలెంట్ ను వెతికి పట్టుకున్నారు మేకర్స్. ఆమె మరెవరో కాదు, పాపులర్ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ . సోషల్ మీడియాలో తనదైన ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో లక్షలాది మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న నాగదుర్గ.. ఈ సినిమాతోనే వెండితెరపై హీరోయిన్ గా సందడి చేయబోతోంది.



