స్పిరిట్ సెట్స్ లో సందీప్ వంగా సర్ప్రైజ్ పోస్ట్!

ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అంటే సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ ఆకాశాన్ని అంటుతాయి. అభిమానుల దగ్గరి నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా కురిపిస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లలో స్పిరిట్ కూడా ఒకటి . అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా టైటిల్ లోగో కానీ, కాన్సెప్ట్ పోస్టర్ కానీ వస్తుందని అందరూ ఆశించారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్ లో అభిమానులకు ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ ఇచ్చారు.
అందరి దర్శకుల్లా కేవలం ఒక ఫార్మల్ విషెస్ మాత్రమే కాకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఏకంగా స్పిరిట్ సినిమా సెట్స్‌లో ప్రభాస్‌తో కలిసి దిగిన ఒక అన్-సీన్ క్రేజీ ఫొటోను పంచుకుంటూ తన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలిసి ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ఒక్కసారి గమనిస్తే.. సందీప్ రెడ్డి వంగా చేతిలో ఒక ఖరీదైన మందు బాటిల్ పట్టుకుని ఉండగా, మన డార్లింగ్ ప్రభాస్ ఎంతో స్టైలిష్ గా నవ్వుతూ ఆ బాటిల్ ను చూపిస్తూ ఆయనతో ఏదో సరదాగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు. అన్నా.. లెట్స్ పార్టీ.. ఇవాళ నీ పుట్టినరోజు. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్ అన్నా అంటూ డార్లింగ్ పై తనకున్న విపరీతమైన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. తమ హీరో పుట్టినరోజున డైరెక్టర్ పంచుకున్న ఈ క్యాండిడ్ ఫొటోను విపరీతంగా రీట్వీట్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలయిక అనేది నిజంగా ఒక సూపర్ కాంబినేషన్. ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా, హీరో క్యారెక్టరైజేషన్ ను అత్యంత పవర్ ఫుల్ గా, వైలెంట్ గా తీర్చిదిద్దడంలో సందీప్ మాస్టర్. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ప్రభాస్ తన కెరీర్లో ఎప్పుడూ పూర్తి స్థాయి కాప్ రోల్ చేయలేదు. యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సందీప్ చేస్తున్న సినిమా కావడంతో నార్త్ ఆడియన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ పై భారీగా ఆసక్తి కనబరుస్తున్నారు. నిర్మాణం పరంగా కూడా ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. గుల్షన్ కుమార్ మరియు టీ-సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, ప్రభాకర్ రెడ్డి వంగ, క్రిషన్ కుమార్ సంయుక్తంగా భద్రకాళీ పిక్చర్స్ మరియు టీ-సిరీస్ బ్యానర్లపై దీనిని నిర్మిస్తున్నారు.



