వారణాసి ఆల్ టైమ్ రికార్డ్..?

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా.. విడుదలకు ముందే బిజినెస్ పరంగా సరికొత్త సంచలనాలకు తెరలేపుతోంది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలు, రాజమౌళి-మహేష్ కాంబినేషన్ క్రేజ్‌తో వారణాసి సినిమా బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రికార్డు స్థాయిలో జరుగుతోంది. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కుల కోసం టాలీవుడ్ లోని బడా నిర్మాణ సంస్థలన్నీ పోటీ పడ్డాయి. కానీ చివరికి ఈ భారీ డీల్ ను మైత్రీ మూవీ మేకర్స్ ఏకంగా రూ. 285 కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇది మొత్తం 300 కోట్ల డీల్ అని, అందులో 15 కోట్లు రికవరబుల్ అమౌంట్ పోను.. నికర డీల్ విలువ 285 కోట్లు అని సమాచారం. ఇప్పటికీ అడ్వాన్స్ చెల్లింపు పూర్తి చేసి, మైత్రీ సంస్థ ఈ డీల్ క్లోజ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. గతంలో రాజమౌళి తీసిన RRR తెలుగు బిజినెస్‌ను కూడా మించిన ఈ డీల్‌తో వారణాసి విడుదలకు ముందే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసమే ఇంత భారీ ధరకు కొనుగోలు చేయడంతో.. రేపు సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద వారణాసి ఎలాంటి వసూళ్ల సునామీ సృష్టిస్తుందో అని అందరూ లెక్కలు వేసుకుంటున్నారు.
ఓటీటీ హక్కులపై కూడా అంతేస్థాయిలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ గ్లోబల్ అడ్వెంచర్ డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషలకు కలిపి సుమారు 150 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే డిజిటల్ దిగ్గజం జియోహాట్‌స్టార్ పేరు కూడా గట్టిగానే రేసులోకి వచ్చింది. కానీ సినిమా బడ్జెట్ సుమారు 1,400 కోట్ల వరకు ఉంటుందనే అంచనాల నేపథ్యంలో.. నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ పై నిర్మాతలు ఏమాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. మరోవైపు సినిమా అన్ని భాషల డిజిటల్ హక్కులు, బిహైండ్ ది సీన్స్ వంటి ప్యాకేజీలతో కలిపి ఏకంగా రూ.400 కోట్ల నుంచి రూ. రూ.700 కోట్ల వరకు డీల్స్‌పై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ఏప్రిల్ 7, 2027న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది కాబట్టి, ఈ విడుదల తేదీకి ముందే ఈ మైండ్ బ్లోయింగ్ డిజిటల్ డీల్‌పై అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే కానీ స్పష్టత రాదు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభ పాత్రతో అలరించనున్నాడు. అలాగే ప్రియాంక చోప్రా మందాకినీగా మహేష్ సరసన నటిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగాలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.



