బన్నీ ఐకాన్ ప్రాజెక్ట్ ఫిక్స్.. ఇంతకీ ఎవరితో అంటే..?

Bunny Icon Project: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ అనే సినిమాను నిర్మించాలి అనుకున్నారు దిల్ రాజు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. ఈ సినిమాను నిర్మించాలి అనుకోవడమే కాదు.. అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే.. అనుకోని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆతర్వాత బన్నీ పుష్ప, పుష్ప 2 సినిమాలతో బిజీ అవ్వడం.. ఈ రెండు సినిమాల తర్వాత బన్నీ రేంజ్ మారిపోవడంతో ఈ ఐకాన్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఐకాన్ ప్రాజెక్ట్ గురించి దిల్ రాజుని అడిగితే.. ఈ సినిమా ఉందని చెప్పారు. మరి.. ఐకాన్ సినిమాలో నటించే హీరో ఎవరు..?

దిల్ రాజు.. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు అనే సినిమాను నిర్మించారు. ఇది అక్క – తమ్ముడుకు సంబంధించిన కథతో రూపొందిన సినిమా. ఇందులో అక్కగా లయ నటించగా, తమ్ముడుగా నితిన్ నటించాడు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన తమ్ముడు సినిమా పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకుంటే.. రాబిన్ హుడ్ మూవీ నిరాశపరిచింది. అందుకనే ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని.. నితిన్ కి విజయాన్ని అందివ్వాలని.. దిల్ రాజు రంగంలోకి దిగారు. ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఐకాన్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు.

ఐకాన్ మూవీ గురించి దిల్ రాజు ఏం చెప్పారంటే.. పుష్ప, పుష్ప 2, అట్లీతో మూవీ తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ సినిమా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు. అయితే.. ఐకాన్ ప్రాజెక్ట్ లేనట్టేనా అంటే.. అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా ఐకాన్ మూవీ ఉంటుందని చెప్పారు. ఇది యూనివర్శిల్ స్క్రిప్ట్ అని.. స్టోరీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ఆయన చెప్పారు. ఇంతకీ ఏ జోనర్ మూవీ అని అడిగితే.. హ్యామన్ ఎమోషన్స్ తో ఉండే యాక్షన్ మూవీ అని చెప్పారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ ఫోకస్ అంతా తమ్ముడు సినిమా పైనే ఉందని.. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఐకాన్ పై దృష్టి పెడతాడు అన్నారు. Bunny Icon Project.

ఇండస్ట్రీలో ఒకరి కోసం కథ రాస్తే.. మరొకరితో సెట్ అవ్వడం అనేది కామన్. నాటి నుంచి నేటి వరకు ఇలా ఎన్నో సినిమాలు ఒక హీరో కోసం అనుకోవడం.. మరో హీరోతో సెట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఐకాన్ మూవీ విషయంలో కూడా అలాగే జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం వేణు శ్రీరామ్ ఈ కథ రాస్తే.. ఇప్పుడు వేరే హీరోతో ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఎవరితో ఐకాన్ మూవీ చేయనున్నారు అనేది మాత్రం చెప్పలేదు. మరి.. ఐకాన్ సినిమా ఎవరితో చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: https://www.mega9tv.com/cinema/venkatesh-upcoming-movies-and-latest-updates/