యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సంచలనం. ఒక్కసారి డైలాగ్ చదివితే చాలు.. మరోసారి చూసుకోవాల్సిన పనిలేదు. అలాగే డ్యాన్స్ రిహార్సల్ చేయకుండా అదరగొట్టేస్తుంటాడు. టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ యంగ్ టైగర్ బాలీవుడ్ ను దాటేసి.. గ్లోబల్ రేంజ్ లో దూసుకెళుతున్నాడు. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రికార్డు కలెక్షన్స్ తో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ కెరీర్ గురించి క్లుప్తంగా మీ కోసం..

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. గుణ శేఖర్ తీసిన రామాయణంలో రాముడి పాత్రను ధరించాడు ఎన్టీఆర్. అయితే ఈ రామాయణంలోని రాముడి పాత్రను పోషించిన తీరుకి ఎన్టీఆర్‌కు నందిఅవార్డు వచ్చింది.ఇక పదిహేడో ఏటలోకి అడుగు పెట్టిన సమయంలో సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చాడు. అయితే.. ముందుగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగినా.. అది ఆలస్యం అవ్వడం వలన నిన్ను చూడాలని అనే సినిమాను ఓకే చేసేశాడు తారక్. అలా మొత్తానికి నిన్ను చూడాలని సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే విజయం సాధించడంతో పాటు గుడ్ ఫర్ ఫార్మర్ అనిపించుకున్నాడు. ఆతర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో టాలీవుడ్‌ లో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాడు.

రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్ పర్ ఫార్మెన్స్ సత్తా ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. దాదాపు రెండు కోట్లకంటే తక్కువ బడ్జెట్‌తో సినిమా తీస్తే.. 12 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇలా మొదటి సక్సెస్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన ఎన్టీఆర్‌కు ఆ తరువాత పెద్ద దెబ్బ పడింది. సుబ్బు లాంటి డిజాస్టర్ సినిమాలో ఎన్టీఆర్ నటించాడు. అయితే.. ఈ దెబ్బ మానేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆది అంటూ కొత్త అడుగు వేశాడు. ఆది సినిమా సమయానికి ఇంకా 20 ఏళ్లు కూడా నిండలేదు. నూనూగు మీసాల వయసులోనే ఫ్యాక్షనిజంతో అదరగొట్టేశాడు. ఆది సినిమాతో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేశాడు. మాస్‌కు ఎన్టీఆర్, వివి వినాయక్ కొత్త నిర్వచాన్ని ఇచ్చారు. ఆది సినిమాను కూడా రెండు కోట్ల లోపే తెరక్కించారు. కానీ దాదాపు 19 కోట్లను కలెక్ట్ చేసింది.

అల్లరి రాముడు, నాగ ప్లాప్ అయ్యాయి. సింహాద్రి సినిమాతో చరిత్ర సృష్టించాడు. ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా 8 కోట్లుతో తీస్తే.. 25 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశన్నంటింది. ఆంధ్రావాలా డిజాస్టర్ అవ్వగా.. సాంబ పరవాలేదు అనిపించింది. నా అల్లుడు, నరసింహుడు డిజాస్టర్స్ అవ్వగా రాఖీ సినిమా నటుడుగా మంచి పేరు తీసుకువచ్చింది. యమదొంగ, కంత్రి, అదుర్స్, బృందావనం, శక్తి, ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్యా, బాద్ షా.. తదితర చిత్రాల్లో కొన్ని హిట్ అవ్వగా.. కొన్ని ప్లాప్ అయ్యాయి. ఇలా ఒక హిట్టు.. ఒక ఫ్లాపు అనేట్టుగా ఎన్టీఆర్ కెరీర్ నడిచింది.

ఇక టెంపర్ సినిమా దగ్గర నుంచి ఎన్టీఆర్ వరుసగా సక్సెస్ ఇస్తూ దూసుకెళుతున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర.. ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ సినిమాలతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వార్ 2, డ్రాగన్, దేవర 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషేష్ తెలియచేశారు. మరి.. మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని.. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే అండ్ ఆల్ ది బెస్ట్ టు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.