
ఒకప్పుడు ఈ ఫ్రూట్ ఏంటో తెలిసేది కాదు..
ఇప్పుడు అన్ని సీజన్లలో విరివిగా దొరుకుతుంది. దీన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పెద్ద మొత్తంలో ఫైబర్‌తో పాటు, ఇందులోని ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, కెరోటిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మధుమేహం, క్యాన్సర్, డెంగ్యూ లేదా కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.
ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల.. మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాకుండా.. బి1, బి2, బి3 విటమిన్లు కూడా ఈ పండులో అధికం. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఈ పండు ఇన్సులిన్ రెస్టిన్సెన్‌ను పెంచుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఈ పండును రెగ్యులర్ గా తినాలని సూచిస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ రోజూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరగవుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితోపాటు.. డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని దరి చేరకుండా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి ఈ పండును పవర్ హౌస్ గా పిలుస్తారు.