
ఆరోగ్యంగా ఉండటంలో కిడ్నీలు చాలా ముఖ్యం. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేయడంతో పాటు, వ్యర్థ పదార్థాలను తొలగించి శరీరంలోని ద్రవ సమతుల్యతను నియంత్రిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేయడం లాంటి ప్రధాన విధులను ఇవి చేస్తాయి. అలాంటి కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే వ్యర్థ పదార్థాలు శరీరంలో స్టోర్ అయి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అటువంటప్పుడు ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం ముఖ్యం.
- కిడ్నీలు సరిగా పని చేయనప్పుడు రక్తంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. ఇది తీవ్రమైన అలసట, బలహీనత, నీరసం వచ్చేలా చేస్తుంది.
- విష పదార్థాలు శరీరంలో పేరుకుపోవడం వల్ల నిద్ర సరిగా రాదు.
- శరీరంలో ఫాస్పరస్ ఇతర ఖనిజాలు పేరుకుపోయి.. చర్మం పొడిబారడానికి, విపరీతమైన దురదకు దారితీస్తుంది.
- కిడ్నీ సమస్యకు అత్యంత ముఖ్యమైన సూచన.. తరచుగా మూత్రవిసర్జన చేయడం. అది కూడా రాత్రిపూట (నోక్టూరియా)గా భావిస్తారు.
- మూత్రంలో రక్తం కనిపించడం మొదలు కిడ్నీ రాళ్లు, ఇన్ఫెక్షన్లు లేదా కిడ్నీ దెబ్బతినడానికి తీవ్రమైన సంకేతం కావచ్చు.
- దీనికి తోడు ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
తీవ్రంగా ఉంటే..
- హైబీపీ,
- ఎముకల బలహీనత,
- నాడీ వ్యవస్థ సమస్యలు,
- చర్మం నల్లబడటం లేదా బూడిద రంగులోకి మారడం,
- నోటిలో అమోనియా వాసన లేదా లోహపు రుచిలా అనిపించడం,
- లైంగిక సామర్థ్యం తగ్గడం,
నివారణ..
తక్కువ ఉప్పు, ప్రోటీన్, కొవ్వు ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలి.
శారీరక శ్రమ వల్ల కిడ్నీలకే కాదు మొత్తం శరీర ఆరోగ్యానికి మంచిది.
అధిక రక్తపోటు, డయాబెటిస్ కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలు.. కావున వీటిని నియంత్రించుకోవాలి.
శరీరంలో వాటర్ బ్యాలెన్స్ అయ్యేందుకు సరిపడ నీరు తాగాలి.