ఫ్రూట్స్ డిన్నర్ తర్వాత తీసుకుంటున్నారా..?!

Eat Fruits Before Food: సీజనల్ ఫ్రూట్స్ రెగ్యులర్ గా తింటూ ఉంటాం. ముఖ్యంగా చాలామంది భోజనం పూర్తయ్యాక ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకుంటారు. ఇది హెల్దీ హ్యాబిట్ కదా అనే ఫీలింగ్ లో ఉంటాం. కానీ నిజానికి ఫ్రూట్స్‌ తినే సరైన టైమ్‌ విషయం ఏంటో తెలియక, అందులోని పోషకాలను పొందలేక కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటాం. అసలు పండ్లను ఎప్పుడు తీసుకుంటే మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం:

నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఫ్రూట్స్ తింటే, అవి అప్పటికే జీర్ణమవుతున్న ఆహారంతో కలిసి తక్కువ వేగంతో జీర్ణమవుతాయి. దీనివల్ల వాటిలోని విటమిన్లు, ఫైబర్, ఫైటోన్యూట్రియంట్స్‌ పూర్తిగా శరీరానికి సరిగా లభించకపోవచ్చు. ఫ్రూట్స్‌లో ఉండే ఫ్రుక్టోస్‌ వల్ల అజీర్తి, గ్యాస్ ఉబ్బరం లాంటి సమస్యలు సైతం ఏర్పడవచ్చు.

అందుకే ఫ్రూట్స్ తినడానికి ఉత్తమ సమయం భోజనం ముందు లేదా మధ్యాహ్నం స్నాక్ టైమ్‌ బెటర్ గా ఉంటుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే అందులోని పోషకాలన్నీ త్వరగా, సరిగ్గా శరీరానికి అబ్జర్వ్ అవుతాయి. Eat Fruits Before Food.

అలాగే, రాత్రిళ్ళు అధిక మోతాదులో ఫ్రూట్స్ తినకూడదు. ఎందుకంటే రాత్రి శరీరం జీర్ణ ప్రక్రియను నెమ్మదించేస్తుంది. ఈ సమయంలో ఫ్రూట్స్ లోని చక్కెరలు శరీరంలో కొవ్వుగా నిల్వ అయ్యే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 మధ్యన లేదా సాయంత్రం 4 నుంచి 5 మధ్య ఫ్రూట్స్ తినడం చాలా ఉత్తమం!

Also Read: https://www.mega9tv.com/life-style/5-magical-drinks-that-actually-help-to-melt-the-belly-fat-checkout-what-they-are/