ఆసక్తిని పెంచేసిన ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్…నితిన్ కు ఈసారి హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్లో చాలాకాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరో నితిన్ ఈ క్రమంలో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. గతంలో వచ్చిన రాబిన్‌హుడ్, తమ్ముడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో, కథల ఎంపికలో ఎంతో జాగ్రత్త పడుతూ వచ్చిన నితిన్.. ఇప్పుడు అలియాస్ రుక్మిణి అనే విభిన్నమైన చిత్రంతో డిసెంబర్ 4 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ తో సినిమాపై హైప్ విపరీతంగా పెరిగింది. ఈసారి నితిన్ కచ్చితంగా హిట్ కొట్టేలా ఉన్నాడన్న టాక్ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది. పూర్తిగా వినోదాత్మకంగా సాగుతూనే, కొన్ని చోట్ల హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
ఇక ఈ సినిమాపై ఇంతటి నమ్మకం ఏర్పడటానికి అతిపెద్ద కారణం..నేచురల్ స్టార్ నాని. నాని కేవలం నటుడిగానే కాదు, ఒక అభిరుచి గల నిర్మాతగా, సమర్పకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో ఆయన నిర్మించిన, సమర్పించిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా కోర్ట్ సినిమాతో నాని ఎన్నో ప్రశంసలు పొందారు. ట్రైలర్ లాంచ్ అనౌన్స్మెంట్ నుంచి వివిధ వేదికల వరకు నాని స్వయంగా సినిమాను ప్రమోట్ చేస్తుండటంతో.. ఈసారి నితిన్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం దర్శకుడు మురళికాంత్ దేవసోత్. గతంలో దండోరా సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన, ఈసారి నితిన్‌ను ఒక సరికొత్త, వినోదాత్మక కోణంలో చూపిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నితిన్ సరసన ఆఫియా సయ్యద్ హీరోయిన్గా నటించింది. ట్రైలర్లో నితిన్ - ఆఫియా సయ్యద్ కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. గతంలో రాబిన్‌హుడ్, తమ్ముడు వంటి సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో నితిన్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ ఏడాది ఆయన సినిమా వస్తుందా రాదా అన్న అనుమానాల మధ్యే అలియాస్ రుక్మిణి తో డిసెంబర్ 4న బరిలోకి దిగుతున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్, కడుపుబ్బా నవ్వించే ట్రైలర్, దర్శకుడు మురళికాంత్ దేవసోత్ టేకింగ్, వీటన్నింటికీ తోడు నేచురల్ స్టార్ నాని సమర్పణ.. ఇవన్నీ అలియాస్ రుక్మిణిపై భారీ అంచనాలను పెంచాయి. హిట్ కోసం పరితపిస్తున్న నితిన్‌కు డిసెంబర్ 4న ఈ సినిమా కోరుకున్న విజయాన్ని అందిస్తుందో లేదో వేచి చూడాలి.



