క్రాష్ జోన్ లో ఆ నగరాలూ…దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కు చెందిన ఒక భారీ స్పేస్ టెలిస్కోప్.. తన కక్ష్యను కోల్పోయి ఇప్పుడు నేరుగా భూమి వైపు భయంకరమైన వేగంతో దూసుకొస్తోంది. ఈ టెలిస్కోప్ పేరు నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ దీని బరువు 1500 కిలోలు. ఈ భారీ స్పేస్ టెలిస్కోప్..ఇవాళ భూ వాతావరణంలోకి ప్రవేశించి ముక్కలు ముక్కలుగా కూలిపోబోతోంది. అయితే ఇక్కడ మనం ఆందోళన చెందాల్సిన ఒక బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే.. ఈ టెలిస్కోప్ కూలిపోయే క్రాష్ జోన్ పరిధిలో మన భారతదేశం కూడా ఉంది. ముఖ్యంగా మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి మహా నగరాలు కచ్చితంగా ఈ డెంజర్ జోన్ లోనే ఉన్నాయని నాసా అఫీషియల్ గా ప్రకటించింది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం.. 2004 నవంబర్ 20న నాసా ఈ నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. విశ్వంలో జరిగే అద్భుతాలను, విస్ఫోటనాలను రికార్డ్ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ టెలిస్కోప్ నాసా అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ కాలం, అత్యంత అద్భుతంగా పనిచేసింది. ఈ 22 ఏళ్లలో ఇది విశ్వంలో జరిగిన 2000కు పైగా గామా కిరణాల విస్ఫోటనాలను, 1400 సూపర్ నోవాలను కచ్చితంగా పరిశీలించి నాసాకు ఎంతో అమూల్యమైన డేటాను పంపించింది. అయితే, రెండు దశాబ్దాలుగా నిరంతరాయంగా సేవలందించడంతో ఈ టెలిస్కోప్ కక్ష్య క్రమక్రమంగా క్షీణించడం మొదలైంది. ఇది భూమి గురుత్వాకర్షణ శక్తికి లోబడి కిందికి జారిపోతుండటాన్ని గమనించిన నాసా సైంటిస్టులు.. దాన్ని తిరిగి సరైన కక్ష్యలో పెట్టేందుకు ఒక రెస్క్యూ మిషన్ చేపట్టారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. నాసా చేపట్టిన ఆ మిషన్ విఫలం కావడంతో, ఇక ఆ 1500 కిలోల భారీ టెలిస్కోప్ భూమి పైకి కూలిపోవడం అనివార్యంగా మారింది.
నాసా మిషన్ చీఫ్ సైంటిస్ట్ బ్రాడ్ సెంకో ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం.. నవంబర్ 4న అమెరికా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు , అంటే మన భారత కాలమానం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ టెలిస్కోప్ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది .అది కిందికి వచ్చే ఆ భౌగోళిక పరిధిని నాసా ముందే లెక్కించింది. ఇది దక్షిణ అక్షాంశం 20.6 డిగ్రీల నుంచి ఉత్తర అక్షాంశం 20.6 డిగ్రీల మధ్యలో ఎక్కడైనా కూలవచ్చు. ఈ రీఎంట్రీ క్రాష్ జోన్ లో ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, మధ్య దక్షిణ అమెరికాతో పాటు మన ఇండియా కూడా ఉంది. స్పష్టంగా చెప్పాలంటే.. మన దేశ పశ్చిమ తీరంలో ఉన్న డామన్ నుంచి తూర్పు తీరంలో ఉన్న ఒడిశా రాష్ట్రం కటక్ వరకు ఒక గీత గీస్తే.. ఆ గీతకు దక్షిణంగా ఉన్న ప్రాంతాలన్నీ ఈ క్రాష్ జోన్ పరిధిలోకే వస్తాయి. దాన్నిబట్టి చూసుకుంటే ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలు కచ్చితంగా ఈ డేంజర్ జోన్ లోనే ఉన్నాయని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. అయితే దీనిపై అస్సలు భయపడాల్సిన పనిలేదు. దీని వెనుక ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంది. టెలిస్కోప్ మొత్తం బరువు 1500 కిలోలే అయినా, అది సెకనుకు కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే విపరీతమైన ఘర్షణ, వేడి కారణంగా దాదాపు 90 శాతానికి పైగా టెలిస్కోప్ గాల్లోనే మంటల్లో కాలి బూడిద అయిపోతుంది. కేవలం అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే కొన్ని ఇనుప భాగాలు, సుమారు 100 కిలోల బరువుండే విడిభాగాలు మాత్రమే భూమి ఉపరితలాన్ని చేరే అవకాశం ఉంది. అయితే ఆ ముక్కలు కూడా జనావాసాల మీద పడే అవకాశం మిలియన్ లో ఒక్క శాతం మాత్రమే. ఎందుకంటే మన భూమి మీద 71 శాతం కేవలం సముద్రాలే ఉన్నాయి కాబట్టి, ఆ మిగిలిన 100 కిలోల శకలాలు చాలా వరకు ఇండియన్ ఓషన్ లో పడే ఛాన్స్ మాత్రమే ఉందని నాసా శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. 22 ఏళ్లు మనకు ఎంతో నాలెడ్జ్ ఇచ్చిన ఒక అద్భుతమైన టెలిస్కోప్ కు నవంబర్ 4న గ్రాండ్ గా ఫేర్ వెల్ ఇద్దాం.



