ఆ ప్యాంట్ వెనుక ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా? 20 ఏళ్ల నాటి సీక్రెట్ చెప్పిన రేణు దేశాయ్

తెలుగు ఇండస్ట్రీలో స్టైల్ కు ఐకాన్ గా ఒక జెనరేషన్ లో ట్రెండ్ సెట్ చేసిన హీరో అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . తన మేనరిజం, నడక, హెయిర్ స్టైల్, ముఖ్యంగా కాస్ట్యూమ్స్ లో కూడా పవన్ ఒక ట్రెండ్ సెట్టర్. తొలిప్రేమ, ఖుషి, గుడుంబా శంకర్, జల్సా.. ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో పవన్ వేసుకునే కాస్ట్యూమ్స్ అప్పట్లో యూత్ ను ఒక ఊపుఊపేశాయి. 2005లో వచ్చిన ‘బాలు’ సినిమాలో గని క్యారెక్ట్ లో పవన్ యాక్టింగ్, ఇంకా ప్యాంట్, ఆయన స్టైల్ కు అప్పట్లో జనాలు థియేటర్లలో పూనకాలతో ఊగిపోయారు. ప్రతి కుర్రాడు ఆ ప్యాంట్ కొనుక్కోవడానికి ఎగబడ్డాడు. అయితే కట్ చేస్తే, 20 ఏళ్ల తర్వాత, ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన రేణు దేశాయ్ పవన్ వేసుకున్న ఆ ప్యాంట్ గురించి ఎవ్వరికీ తెలియని ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ బయటపెట్టారు. బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన ఆ ప్యాంట్లు మామూలు షోరూమ్ లో దొరికేవి కావు. అవి ఏకంగా రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి నిజమైన ఫ్యాబ్రిక్ తో ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ క్లాత్ ప్రపంచంలోనే చాలా అరుదైనది. ఇది ఈజీగా ఎక్కడపడితే అక్కడ దొరకదు. ఆ ప్యాంట్ ను తయారు చేయించడానికి మేము ముందే వాళ్లకు భారీ అడ్వాన్స్ చెల్లించాం. ఏకంగా మూడు నెలల పాటు వెయిట్ చేసి ఆ ప్యాంట్లను డెలివరీ తీసుకోవాల్సి వచ్చింది అని రేణు దేశాయ్ వివరించారు. ఇటలీకి చెందిన ఒక ప్రముఖ హాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ చేతుల మీదుగా అత్యంత ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్యాంట్ ను రేణు దేశాయ్ స్వయంగా డిజైన్ చేయించారు. గని క్యారెక్టర్ లో ఉన్న ఆ రగ్గడ్ నెస్ రావడానికే అంత కష్టపడి ఆ ఫ్యాబ్రిక్ ను వెతికి మరీ పవన్ కు డిజైన్ చేశారు.



