బాలయ్య ఫ్యామిలీ నుంచి మరో సర్ప్రైజ్..మోక్షజ్ఞ కంటే ముందే తేజస్విని గ్రాండ్ ఎంట్రీ..!

నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తాడా అని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా తన డెబ్యూ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి అభిమానుల్లో భారీ జోష్ నింపింది. అటు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అని సంబరాలు చేసుకుంటున్న టైమ్‌లోనే.. ఇప్పుడు నందమూరి కుటుంబం నుండి మరో సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. అసలు మోక్షజ్ఞ హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వకముందే, బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజస్విని ఇండస్ట్రీలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారట. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా స్టార్ హీరోల పిల్లలు వెండితెరపై హీరోలుగానో, హీరోయిన్లుగానో మెరవాలని అనుకుంటారు. కానీ బాలయ్య కూతురు తేజస్విని మాత్రం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆమెకు నిర్మాణ రంగం, అలాగే ప్రొడక్షన్ కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆమెకు తెరవెనుక వ్యవహారాలపై మంచి పట్టు ఉంది. తండ్రి బాలకృష్ణ సినిమాల వ్యవహారాలను, కథల ఎంపికను ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఆహా ఓటీటీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేసి తన టాలెంట్ ఏంటో, తన ప్లానింగ్ ఏంటో తేజస్విని నిరూపించుకున్నారు. అయితే ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఆమె ఒక కొత్త డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. మరి ఆ డైరెక్టర్ ఎవరంటే.. ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం స్వయంభు చిత్ర నిర్మాత భువన్ . అవును, ఇప్పటిదాకా నిర్మాతగా ఉన్న భువన్, తేజస్విని నిర్మించే ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారట. ఒక కొత్త, ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ కాన్సెప్ట్‌తో కూడిన కథను ఆయన సిద్ధం చేశారట. ఆ కథ తేజస్వినికి విపరీతంగా నచ్చడంతో, ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఈ సినిమాను నిర్మించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరో ఎవరన్నది కూడా దాదాపు ఫైనల్ అయిపోయింది. స్టార్ హీరోల జోలికి వెళ్లకుండా, కథకు ఎవరు సెట్ అవుతారో వారినే తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో హెబ్బా పటేల్‌తో కలిసి ఏంజల్ అనే సినిమాలో నటించి మెప్పించిన అన్వేష్ ఈ సినిమాలో హీరోగా చేయబోతున్నారని సమాచారం. కేవలం హీరో మాత్రమే కాదు, ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన, పవర్ ఫుల్ పాత్ర కోసం జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు బాబీ సింహాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఇంట్రెస్టింగ్ కథ అని టాక్ వినిపిస్తోంది. కాలేజీ వాతావరణంలో సాగే కొన్ని కీలక సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ మొదలుకానుందని తెలుస్తోంది. హీరోయిన్ , ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను సినిమా ప్రారంభోత్సవం రోజునే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త మాత్రం నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అటు వారసుడు మోక్షజ్ఞ హీరోగా, ఇటు తేజస్విని ఒక పవర్ఫుల్ నిర్మాతగా ఇండస్ట్రీలో తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.



