మళ్లీ పరుగందుకున్న పసిడి..ప్రస్తుత బంగారం ధరలు

బంగారం ధరల్లో మళ్లీ మార్పు కనిపిస్తోంది. ఇవాళ ఉదయం హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా నమోదయ్యాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1 లక్ష 28 వేల ,410 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఒక్కరోజే రూ.1,860 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1 లక్ష 17 వేల 710 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఒక్కరోజే 1,710 రూపాయలు పెరిగింది. వెండి కిలో....రూ.1 లక్ష ,70 వేల 100 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే దాదాపు రెండు వేల రూపాయల మేర పసిడి ధర పెరగడంతో, ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత బడ్జెట్ పెరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు హైదరాబాద్‌తో పోలిస్తే కొంత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1 లక్ష 28 వేల 560 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1 లక్ష 17 వేల ,860 వద్ద కొనసాగుతోంది. మరోవైపు చెన్నై, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1 లక్ష ,28 వేల ,410 రూపాయలుగా గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1 లక్ష 17 వేల ,710 రూపాయలుగా నమోదైంది. నగరాన్ని బట్టి రవాణా ఖర్చులు, స్థానిక పన్నులు, మార్కెట్ పరిస్థితుల కారణంగా ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తుంటాయి.
అసలు బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా ఎగబాకడానికి ప్రధాన కారణం పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్. ప్రస్తుతం శుభ ముహూర్తాల కాలం కావడంతో దేశవ్యాప్తంగా లక్షలాది వివాహాలు జరుగుతున్నాయి. భారతీయ సంప్రదాయంలో పెళ్లిళ్లంటేనే బంగారు ఆభరణాల కొనుగోళ్లు తప్పనిసరి. దేశీయ మార్కెట్లో బంగారానికి ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడటంతో, బులియన్ మార్కెట్లో ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారానికి డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు రోజురోజుకూ కొత్త గరిష్టాల వైపు పయనిస్తున్నాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1 లక్ష 17 వేల 710 రూపాయలుగా కనిపిస్తున్నప్పటికీ.. షోరూమ్‌కు వెళ్లి నగలు కొనుగోలు చేసే సమయానికి అసలు బిల్లు మరింత భారీగా ఉంటోంది. ఎందుకంటే ఈ ధరకు అదనంగా 3 శాతం జీఎస్టీ, ఆభరణాల డిజైన్‌ను బట్టి తరుగు మజూరీ, కలుస్తాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలంటేనే తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు బంగారం ధరలు మరీ ఎక్కువగా ఉండటంతో కొందరు లైట్ వెయిట్ జువెలరీ వైపు, 18 క్యారెట్ల ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ధరలు ఇంత భారీగా పెరిగిన సమయంలో బంగారం కొనుగోలు చేసేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీరు కొనుగోలు చేసే ఆభరణాలపై కచ్చితంగా బీఐఎస్ హాల్‌మార్క్ , 6 అంకెల హెచ్‌యూఐడీ కోడ్ ఉందో లేదో తనిఖీ చేసుకోండి. తరుగు, మజూరీ విషయంలో వివిధ షోరూమ్‌ల మధ్య ధరలను పోల్చి చూసుకోండి.బంగారం కొనుగోలు చేసిన తర్వాత కచ్చితంగా పక్కా బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. పెళ్లిళ్ల సీజన్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ బంగారానికి డిమాండ్ బలంగానే ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, దేశీయ డిమాండ్‌ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగనున్నాయి.



