ముఖ్య కంటెంట్‌కు వెళ్లడానికి
Mega9 TVMega9 TV📰
బ్రేకింగ్ న్యూస్

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం…నషా ముక్త్ భారత్ సాకారం కావాలి…పిలుపునిచ్చిన ప్రముఖులు

Mega9 TV Adminప్రచురణ: 28 నవంబర్, 2026 05:29 AMకి👁 603 నిమి చదవండి
షేర్ చేయండి:
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం…నషా ముక్త్ భారత్ సాకారం కావాలి…పిలుపునిచ్చిన ప్రముఖులు
FONT SIZE

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన “హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్” పాదయాత్ర ఘనంగా ముగిసింది. నగర వ్యాప్తంగా ఈ నెల 25,26,27 మూడు రోజుల పాటు సుమారు 40 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగింది. ఇక ఈ యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ మహాయాత్రలో 220 పాఠశాలలు, 52 జూనియర్ కళాశాలలు, 30 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి సుమారు 43,000 మంది విద్యార్థులు కదలివచ్చి డ్రగ్స్ కు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. తెలుగు సీనియర్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, విలక్షణ నటుడు సాయికుమార్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తదితర సినీ ప్రముఖులు కూడా యాత్రలో పాల్గొని యువతలో కొత్త జోష్ నింపడమే కాకుండా తమ సందేశాన్ని ఇచ్చారు. ​ఇక మూడో రోజు జూబ్లీహిల్స్‌ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పాదయాత్ర ముగింపు సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఇతర ప్రముఖులు తమ స్ఫూర్తిదాయక ప్రసంగాలతో డ్రగ్స్‌ కు దూరంగా ఉండాల్సిన అవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029 నాటికి నషా ముక్త్ భారత్ సాధించాలన్న సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని స్పష్టం చేశాను.

ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కిషన్ రెడ్డి ఇవాళ వారి గళాన్ని మనకు అప్పగించారు. కిషన్ రెడ్డి గారి లక్ష్యాన్ని మనమందరం ముందుకు తీసుకువెళ్లాలన్నారు. 48 సంవత్సరాల క్రితం 22 ఏళ్ల యువకుడు ప్రసాద్ అనే ఒక యువకుడు.. ఫిలిం ఇన్స్టిట్యూట్లో తన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకుని , హీరో అవ్వాలని జాయిన్ అయ్యాడు..

చెన్నైలోని పాండి బజార్ లో మన కృష్ణా నగర్ లా సినిమా వాళ్ళు ఉంటారు.. ఆనాడు నాకు మందు తాగమని పరిచయాలు ఏర్పడతాయని కొందరు చెబితే నేను అక్కడి నుంచి ఏదోలా తప్పించుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకసారి పొరపాటున ఆ అలవాటు చేసుకుంటే.. ఆ అలవాటు మరో అలవాటుకి దారి తీసే అవకాశం ఉంటుంది.. అది లక్ష్యానికి అడ్డుగా మారే అవకాశం ఉంటుంది అందుకే లక్ష్యం వైపు మాత్రమే గురి పెట్టి ముందుకు వెళ్ళు అని ఒక పెద్దాయన చెప్పారు. అప్పటినుంచి నేను ఎప్పుడూ పాండీ బజార్ వైపు వెళ్ళలేదు.. అప్పటినుంచి నా దృష్టి నా లక్ష్యం నా భవిష్యత్తు పైనే పెట్టాను. అలా వెళుతూ వెళుతూ ఇన్నాళ్లకు మీ ముందు మెగాస్టార్ ల నిలబడ్డానని తన ప్రస్థానాన్ని మెగాస్టార్ వివరించారు. కచ్చితంగా నా లక్ష్యమే నాకు ప్రధానం. ఎంతమంది యువత హీరోల అవ్వాలనుకున్నారు. హీరోలంటే సినిమా హీరోలు మాత్రమే కాదని మీరు ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత స్థానానికి వెళ్లి హీరోలు అనిపించుకోవాలన్నారు. అత్యున్నత స్థానానికి వెళ్లాలంటే ప్రతి ఒక్కరికి ఉన్నత లక్ష్యం ఉండాలని అయితే ఆ లక్ష్యానికి వెళ్లే మార్గంలో పెనుబూతంలా డ్రగ్స్ ఉందని అన్నారు. ప్రస్తుతం చిన్నపిల్లలు కూడా దానికి బానిస అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎవరూ కూడా కావాలని డ్రగ్స్ కు బానిస అవ్వాలని అనుకోరని కానీ ఎవరో కొంతమంది స్నేహితులు వారికి అలవాటు చేస్తారు.. తర్వాత దానికి బానిసగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు.. తర్వాత తన లక్ష్యాన్ని చేరుకోలేరని అన్నారు. డ్రగ్స్ కు బానిసైతే కుటుంబాన్ని రోడ్డున పడేసిన వారు అవుతారని జీవితాన్ని సార్ధకం చేసుకోకపోతే వ్యర్థమని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్యం వైపు వెళ్లేలా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని మన తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వించే విధంగా ఉండాలని సూచించారు. మన సక్సెస్ అంటే మన కుటుంబ సక్సెస్ అని ఎంతోమందిని అభివృద్ధి వైపు తీసుకు వెళ్లిన వాళ్ళం అవుతామని చెప్పారు. దేశంలో యువత ఎక్కువగా ఉన్నారని అలాంటి యువత తమ లక్ష్యం వైపు దూసుకు వెళితే ఈ దేశాన్ని ఆపటం ఎవరి తరం కాదని ఆర్థిక వ్యవస్థలో భారత్ నెంబర్ వన్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు.

కామెంట్లు (0)

మీ అభిప్రాయం రాయండి

అసభ్య/స్పామ్ కామెంట్లు తొలగించబడతాయి.

సంబంధిత వార్తలు