ముఖ్య కంటెంట్‌కు వెళ్లడానికి
Mega9 TVMega9 TV📰
బ్రేకింగ్ న్యూస్

హసీనా రాకపై బంగ్లాదేశ్‌లో వేడెక్కిన రాజకీయం.. అమెరికా మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు

Mega9 TV Adminప్రచురణ: 28 నవంబర్, 2026 06:02 AMకి👁 01 నిమి చదవండి
షేర్ చేయండి:
హసీనా రాకపై బంగ్లాదేశ్‌లో వేడెక్కిన రాజకీయం.. అమెరికా మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు
FONT SIZE

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత పదవిని కోల్పోయిన భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి గత రెండేళ్లుగా ఆమె భారత్‌ లోనే నివాసం ఉంటున్నారు. అయితే, తాజాగా డిసెంబర్ 16వ తేదీన తాను తిరిగి బంగ్లాదేశ్ వెళ్తున్నట్లు షేక్ హసీనా ప్రకటించడంతో ఆ దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో ఉన్న షేక్ హసీనా మద్దతుదారులు, అవామీ లీగ్ కార్యకర్తలు తమ అధినేత రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘర్షణలు, బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటుండటంతో భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.ఇలాంటి కీలక సమయంలో అమెరికా రక్షణ శాఖ, అంటే పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. 2002 నుంచి 2004 వరకు పెంటగాన్‌లో పనిచేసిన మైఖేల్ రూబిన్, తాజాగా న్యూయార్క్‌లో జరిగిన బంగ్లాదేశ్ ఫ్యూచర్ అనే సదస్సులో పాల్గొని సంచలన హెచ్చరికలు చేశారు. బంగ్లాదేశ్ వెళ్లిన తర్వాత షేక్ హసీనాకు ఏదైనా హాని జరిగితే, అందుకు ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. షేక్ హసీనా భద్రత, రక్షణ విషయంలో భారతదేశం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి రాజీ పడకూడదని ఆయన కీలక సూచన చేశారు. మరోవైపు, షేక్ హసీనా బంగ్లాదేశ్ రాక విషయంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న అనూహ్య యూటర్న్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇన్నాళ్లూ షేక్ హసీనాను తమ దేశానికి పంపించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశంపై నిరంతరం ఒత్తిడి తెస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె స్వయంగా డిసెంబర్ 16న బంగ్లాదేశ్ వస్తానని ప్రకటించేసరికి, అక్కడి ప్రభుత్వం స్వరం మార్చేసింది . దీనిపై బంగ్లాదేశ్ విదేశాంగ సహాయమంత్రి హుమాయున్ కబీర్ అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా ఒక సాధారణ ప్రయాణికురాలిగా బంగ్లాదేశ్ రావడానికి అస్సలు వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. నేరస్థులను తీసుకువచ్చే విధంగా కేవలం అప్పగింత ప్రక్రియ ద్వారా మాత్రమే ఆమె రావాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, హసీనాను ఒక ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ.. ఆమె చేతికి సంకెళ్లు వేసి మాత్రమే తీసుకురాగలమని హుమాయున్ కబీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మొత్తం మీద డిసెంబర్ 16వ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత వేడెక్కాయి. మరి ఆమె అనుకున్నట్లు బంగ్లాదేశ్‌లో అడుగుపెడతారా, అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

కామెంట్లు (0)

మీ అభిప్రాయం రాయండి

అసభ్య/స్పామ్ కామెంట్లు తొలగించబడతాయి.

సంబంధిత వార్తలు