అటు రామాయణలో సీతగా…మరోవైపు పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో…నవంబర్ లో సాయి పల్లవి వరుస సినిమాలు

సాయి పల్లవి తనదైన నటన, డ్యాన్స్, అందంతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆమె చేస్తున్న ప్రాజెక్టులు ఆకట్టుకుంటున్నాయి. ఈ నవంబరులో వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దీపావళికి 'రామాయణం'తో సీత పాత్రలో నటిస్తోంది.
భారతీయ ఇతిహాసాల్లో అత్యంత పవిత్రమైన, ప్రతి భారతీయుడి హృదయానికి దగ్గరైన కథ రామాయణం. ఈ అద్భుత ఘట్టాన్ని వెండితెరపై ఎంతోమంది దర్శకులు ఎన్నో రకాలుగా ఆవిష్కరించారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణ ప్రాజెక్ట్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీస్థాయిలో తెరకెక్కుతూ అంచనాలను పెంచేసింది. దంగల్ లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అనౌన్స్మెంట్ రోజు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తన నటనతో, క్యారెక్టరైజేషన్ తో అభిమానుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్న సాయిపల్లవి సీతాదేవి పాత్రలో కనిపించనున్నారు. గ్లామర్ షో కు దూరంగా, కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మైమరిపించిన ఆమె పురాణపాత్రతో ఈసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక మరోవైపు 'ఓం'లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ రోల్ చేయనున్నారు. ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించారు. ఇది నవంబరు 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇందులో సాయిపల్లవి పోషించిన ఐపీఎస్ ఆఫీసర్ నిత్యా రెడ్డి పాత్రకి సంబంధించిన టీజర్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఓం టీజర్ లో సాయి పల్లవి లుక్ కు విశేష స్పందన వస్తోంది. ఇక సాయి అభ్యంకర్ ఇచ్చిన పవర్ ఫుల్ ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ స్థాయిని అమాంతం పెంచేసింది. సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద నవంబర్ 20న ఈ ఓం సినిమా భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతోంది. సీతమ్మగా రామాయణ వంటి భారీ సినిమా తరువాత సరిగ్గా కొన్ని రోజుల గ్యాప్ లోనే ఐపీఎస్ నిత్యారెడ్డిగా ఆమె యాక్షన్ అవతారం చూసి థ్రిల్ అవ్వడం ఖాయం. హీరోయిన్ సెంట్రిక్ క్యారెక్టర్ కు ధనుష్, మమ్ముట్టి లాంటి స్టార్లు కూడా తోడవ్వడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



