భవిష్యత్ తరానికి భారీ ఆఫర్.. ఆసక్తికరంగా మస్క్ ‘ఎక్స్’ పోస్ట్

ప్రపంచ సంపన్న వ్యక్తిగా అంచెలంచెలుగా ఎదిగి సాంకేతికంగా ఎన్నో సవాళ్లను అధిగమించి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు ఎలాన్ మస్క్.
మానవాళి భవిష్యత్తును మరింత ఉన్నతంగా, స్ఫూర్తిదాయకంగా మార్చడం మరియు భూమిపైనే కాకుండా ఇతర గ్రహాలపై మానవ నాగరికతను విస్తరించడం ఆయన లక్ష్యంగా కనిపిస్తుంటుంది.
రీ యూజబుల్ భారీ 'స్టార్‌షిప్' రాకెట్లను తయారు చేయడం వంటి వినూత్న ఆలోచనలతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మన్ననలు పొందుతున్నాయి.
ఈ వ్యాఖ్యలకు ఎటువంటి స్పందన వస్తోంది. ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ కంపెనీ షేర్లను అమెరికాలోని ప్రతి పిల్లలకు ఇస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో రాబోతున్నాయని మస్క్ తన పోస్ట్‌లో తెలపడం చర్చనీయంశంగా మారింది.
ప్రస్తుతం స్పేస్ఎక్స్ యొక్క ఒక షేర్ విలువ సుమారు మన దేశ కరెన్సీలో దాదాపు రూ.12,000 నుండి రూ.14,000 వరకు ఉంది. మరి అమెరికాలో జనాభా లెక్కల ప్రకారం అక్కడ 18 ఏళ్లలోపు పిల్లలు దాదాపు 7.20 నుండి 7.30 కోట్ల మంది దాకా ఉంటారు. మస్క్ చెప్పిన దాని ప్రకారం పిల్లలందరికీ షేర్లు పంపిణీ చేస్తే సుమారు 10.5 బిలియన్ డాలర్ల నుండి 11 బిలియన్ డాలర్ల విలువైన సంపద అంటే మన కరెన్సీలో దాదాపు రూ.90,000 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అయితే గనుక ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత పెద్ద దాతృత్వ విరాళంగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఎలాన్ మస్క్ ప్రకటనపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అందులో కొందరు పొగడ్తలు కురిపిస్తుంటే కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదన అమెరికా ఆర్థిక రంగంలో ఒక సంచలనంగా మారింది. మరి ఇది అమల్లోకి వస్తే అమెరికా భవిష్యత్ తరానికి భారీగా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అలాగే దీని వెనుక ఏదైనా కార్పొరేట్ వ్యూహాలపై కూడా విమర్శకుల నుండి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి మస్క్ ఏవిధంగా తాను చెప్పింది చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది. మస్క్ ఈ ప్రకటనను సోషల్ మీడియాలో సాధారణంగా పోస్ట్ చేశారు మరి ఏ వయస్సు పిల్లలకు ఇస్తారు అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ ప్రకటనపై ప్రపంచ వ్యాప్తంగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ ఉదారతను, భావి తరాల పట్ల ఆయనకున్న దూరదృష్టిని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైన ప్రకటనల వెనుక ఏదైనా కార్పొరేట్ వ్యూహాలు, పన్ను ప్రయోజనాలు లేదా ప్రచార పాచికలు ఉండవచ్చని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రతిపాదన అమెరికా ఆర్థిక మరియు కార్పొరేట్ రంగాలలో పెద్ద అలజడి సృష్టించింది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది వేచి చూడాలి.



