వివాదంలో ప్రభాస్-హను రాఘవపూడి 'ఫౌజీ'.. నేతాజీ మునిమనవడు ఏమన్నారంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ మూవీ..విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సాధారణంగా ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తీస్తున్నప్పుడు, అందులో నిజ జీవిత జాతీయ నాయకుల పాత్రలను చూపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అది దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతుంది. ఇప్పుడు ఫౌజీ సినిమా విషయంలో అదే జరుగుతోంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ పై సుభాష్ చంద్రబోస్ మునిమనవడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఫౌజీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో సమావేశమయ్యే ఒక పవర్ ఫుల్ సన్నివేశాన్ని చూపించారు. ఆ సీన్ చూసి ఫ్యాన్స్ అంతా థ్రిల్ అయ్యారు. కానీ, ఆ సన్నివేశంపై ఇప్పుడు నేతాజీ మునిమనవడు చంద్రకుమార్ బోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ సీన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్‌తో మాట్లాడుతూ.. ఫౌజీ అనే ఒక యోధుడి గురించి వివరిస్తుంటారు. ప్రభాస్ పోషిస్తున్న ఆ కల్పిత పాత్రను నేతాజీ హిట్లర్‌కు పరిచయం చేస్తూ, ఆ క్యారెక్టర్ కి అత్యంత ప్రాధాన్యం కల్పించినట్లుగా ఆ సన్నివేశం డిజైన్ చేయబడిందని పలువురు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చారిత్రకంగా దేశం కోసం పోరాడిన నేతాజీ లాంటి మహనీయుడి పాత్రను.. కేవలం సినిమాలో హీరోను ఎలివేట్ చేయడం కోసం వాడుకోవడం సమంజసం కాదని చంద్రకుమార్ బోస్ విమర్శిస్తున్నారు. జాతీయ నాయకుల విషయంలో సినిమాటిక్ లిబర్టీ పేరుతో వాస్తవాలను వక్రీకరించడం, కల్పిత అంశాలను జోడించడం ఒక నేరమని ఆయన వ్యాఖ్యానించారు. ఫౌజీలో నేతాజీ, హిట్లర్ మధ్య జరిగిన మీటింగ్ ను తప్పుగా చిత్రీకరించారని, దీనివల్ల ఒక కల్పిత పాత్ర ముందు నేతాజీ స్థాయిని తగ్గించినట్లవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.



