హాలీవుడ్ లో కూడా మన బ్రాండ్…జక్కన్న నెక్స్ట్ టార్గెట్!

భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక విజువల్ వండర్ వారణాసి. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కేవలం మరో పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా, అది పూర్తి కాగానే రాజమౌళి పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో సరికొత్త కాన్వాస్‌పై రూపొందుతున్న వారణాసి చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ భారీ చిత్రాన్ని ఉద్దేశించి జక్కన్న చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. RRR జస్ట్ శాంపిల్ మాత్రమే.. వారణాసి ఆర్ఆర్ఆర్ కంటే 5 నుంచి 6 రెట్లు భారీగా ఉండబోతోంది అని మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్లో మాట్లాడిన రాజమౌళి.. మేము ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్‌ను ప్లాన్ చేస్తున్నాం. విజువల్స్ పరంగా, యాక్షన్ కొరియోగ్రఫీ పరంగా, గ్లోబల్ రీచ్ పరంగా ఇది RRR ను మించిపోతుంది అని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే హాలీవుడ్‌కు చెందిన టాప్ టెక్నీషియన్స్, వీఎఫ్ఎక్స్ నిపుణులతో పనిచేస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మికతను, గ్లోబల్ యాక్షన్‌ను మిక్స్ చేసి ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను హాలీవుడ్ ప్రేక్షకులకు రుచి చూపించే విధంగా రాజమౌళి సత్తా చాటుతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ గ్లోబల్ అడ్వెంచర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. గుబురు గడ్డం, పొడవాటి జుట్టు, కండలు తిరిగిన దేహంతో ఆయన సరికొత్త అవతారంలోకి మారిపోయారు. జర్మనీకి చెందిన ఫిజికల్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్ లో పనిచేస్తారో తెలిసిందే. ఏ రకంగా చూసుకున్నా, రాజమౌళి చెప్పినట్లు ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలవబోతోంది. ఎప్పుడూ ఒక సినిమాను మించి మరో సినిమా తీస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే రాజమౌళి.. ఈసారి ఏకంగా హాలీవుడ్ దర్శకులకే సవాల్ విసురుతున్నాడు. మన తెలుగు సినిమా, ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్లో మరింత పైకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మైథాలజీ, ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఖ్యాతిని చాటిచెప్పనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే రాజమౌళి తన సినిమాలతో ఆ స్థాయికి తీసుకెళ్లారు. మరి ఇక ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



