హౌతీల చేతికి హైటెక్ డేటా..ఇరాన్ కు రష్యా సాయం..? రంగంలోకి రష్యా స్పై శాటిలైట్స్!

అమెరికా ధాటికి ఇరాన్ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నసమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ కు రష్యా రహస్యంగా అంతరిక్షం నుంచి స్పై శాటిలైట్స్ ద్వారా డేటా అందిస్తోందని, అమెరికా మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు లీక్ చేస్తోందని తాజాగా ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ నివేదికలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ ను భయపెట్టడానికి, అవసరమైతే ఒక భారీ మిలిటరీ స్ట్రైక్ చేయడానికి అమెరికా తన టాప్ క్లాస్ వార్ షిప్ లు యూఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్ , యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్, యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్‌లను ఆ రీజియన్ లోకి పంపించింది. సాధారణంగా అమెరికా చేసే దాడులు అత్యంత సీక్రెట్ గా, సర్ప్రైజ్ అటాక్ లాగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ మిస్ అయిపోయింది. అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడున్నాయి? ఆయుధాలు ఎక్కడ మోహరిస్తున్నారు? వార్ షిప్స్ రూట్ మ్యాప్ లాంటి అత్యంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రష్యాకు చెందిన కోస్మోస్ సిరీస్ స్పై శాటిలైట్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఈ రియల్ టైమ్ డేటాను రష్యా రహస్యంగా ఇరాన్‌కు పంపుతోంది. దీని ఆధారంగానే ఇరాన్ అమెరికా బేస్‌లపై కచ్చితమైన దాడులు చేస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థలు, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలతో సహా బయటపెట్టాయి. రష్యన్ శాటిలైట్స్ ప్యాట్రన్ ను ట్రాక్ చేస్తే, ప్రతి ఇరాన్ దాడికి ముందు ఆ ప్రాంతం మీదుగా రష్యా శాటిలైట్స్ తిరిగినట్లు కన్ఫర్మ్ అయ్యింది. అయితే రష్యా మాత్రం వీటిని ధ్రువీకరించలేదు.
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ సౌదీ అరేబియాలోని చమురు పైప్లైన్లపై, అలాగే సైనిక స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశారు. తాయిఫ్ బేస్ లో ఒక ఇటాలియన్ ఫైటర్ జెట్‌ను కూడా వారు టార్గెట్ చేశారు. అసలు వాళ్లకు అంత టెక్నాలజీ ఎక్కడిది? వాళ్లకు అంత శాటిలైట్ సపోర్ట్ ఎలా వచ్చింది అంటే.. కచ్చితంగా వెనుక రష్యా హస్తం ఉందని నిపుణులు వాదిస్తున్నారు. అంతరిక్షంలో కూడా యుద్ధ వ్యూహాలు రాబోతున్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల ఒక రష్యన్ శాటిలైట్ ఫిన్లాండ్ కు చెందిన ఒక కమర్షియల్ శాటిలైట్ కు అతి దగ్గరగా వెళ్లి, దాడి చేసేలా రిహార్సల్స్ చేసింది. అంటే రాబోయే రోజుల్లో శాటిలైట్లను టార్గెట్ చేసుకుని కూడా వార్ నడిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్, ఆయిల్ వెల్స్, సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ట్రంప్ ఒక భారీ ఎటాక్ లిస్ట్ రెడీ చేశారు. అయితే ఇప్పుడు రష్యా ఇస్తున్న ఈ శాటిలైట్ డేటాతో ఇరాన్ ఆ దాడులను ముందే పసిగట్టి కౌంటర్ అటాక్ కు సిద్ధం అవుతోంది. దీంతో ఇరాన్, హౌతీలు రెచ్చగొడితే తప్ప తొందరపడి ముందస్తు దాడులకు వెళ్లొద్దని ట్రంప్ తన అడ్వైజర్లకు చెప్పినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే పుతిన్ ఒక మాస్టర్ గేమ్ ప్లే చేస్తున్నారు. ఇరాన్ కు నేరుగా యుద్ధంలో సహకరిస్తే అమెరికాతో డైరెక్ట్ వార్ కు దిగినట్లు అవుతుంది. అందుకే కేవలం ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇస్తూ తెరవెనుక నుంచి కథ నడిపిస్తున్నాడు. ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాలు ఇస్తున్నందుకే, ఇరాన్ కు పుతిన్ ఈ తరహాలో సాయం చేస్తూ అమెరికాకు చెక్ పెడుతున్నాడని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా రష్యా సహాయంతో ఇరాన్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు దుర్బేధ్యంగా కనిపిస్తోంది.



