కళ్లదాలు పెట్టుకోనవసరం లేకుండా ప్రత్యేక లెన్స్ లు వచ్చాయి!

Keratology Ortho K lenses: కొన్నిసార్లు మనకు కాస్త దూరంలో ఉన్న వస్తువులు స్పష్టంగా కనపడవు. అలా దూరంగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపించడాన్నే ‘మయోపియా’ అంటారు. ప్రస్తుతం మనదేశంలో 25% పిల్లలు ఈ మయోపియా సమస్యతో బాధపడుతున్నారట. ఐదేళ్ల వయసు పిల్లలు సైతం కళ్లద్దాలు చిన్ననాటి నుంచే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంటిన్యూగా పెట్టుకోవడం వల్ల తమకు నచ్చిన క్రికెట్ సహా ఏ ఆటనీ స్వేచ్చగా ఆడుకోలేరు. ఎందుకంటే అవి ఎక్కడైనా పడిపోతాయేమోనని భయం! ఇక సర్జరీకి వెళ్లాలన్నా దాన్ని ఇరవైఏళ్లు దాటితే కానీ చేయరు. మరి అంతవరకూ మయోపియా సమస్య ముదరకుండా అదుపులో ఉంచడానికీ, కళ్లద్దాల అవసరాన్ని తగ్గించడానికీ ప్రత్యామ్నాయంగా వచ్చినవే ఈ ఆర్థో-కె లెన్స్.

వీటిని రాత్రివేళ పెట్టుకుని పడుకుంటే చాలు. తెల్లవారేసరికి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.
పగటిపూట కళ్లద్దాలు కానీ, లెన్సులు కానీ వాడాల్సినవసరమే లేదు. ఇది ఎలా పాజిబుల్ అంటారా..
ఈ ప్రత్యేకమైన లెన్స్ లు రాత్రంతా కంటిలోని కార్నియాపైన సున్నితంగా ఒత్తిడి తీసుకొచ్చి, కార్నియాను సరైన ఆకృతిలో ఉంచుతాయి.

దాంతో తెల్లారేసరికి మనకి స్పష్టమైన చూపు వస్తుంది. మీకు తెలుసా.. పూర్వం రాజుల కాలంలో.. యుద్ధ సమయంలో సైనికులకి చూపు తగ్గితే గనుక చాలా ఇబ్బందులు వచ్చేవి. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణం శత్రువుల నుంచి రాజ్యానికి పహారా కాయాల్సి వచ్చేది. అలాంటప్పుడు బాణం గురి తప్పకుండా ఉండేందుకు రాత్రి నిద్రపోయే ముందు తేలికపాటి ఇసుక మూటలని కంటిపైన పెట్టుకుని పడుకునేవారట. తెల్లారితేచూపు బాగయ్యేదట.

దీన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి తరానికి తగ్గట్టుగా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా రూపొందించారు.. అవే ఆర్థో కెరటాలజీ లెన్స్. షార్ట్ ఫార్మ్ లో ఆర్థో కె లెన్స్ అంటారు. ఆర్థో అంటే నేరుగా అని, కెరటో అంటే కార్నియా అని అర్థం. అంటే కార్నియను సరిచేసే లెన్సులు అన్నమాట. Keratology Ortho K lenses.

  • వీటిని పెట్టుకున్న వారం నుంచి రెండు వారాల్లో పూర్తి స్థాయిలో రిజల్ట్స్ నిస్తాయట.
  • అయితే ప్రతిరోజూ రాత్రి ధరించడం కంపల్సరీ.
  • 5 నుంచి 60 ఏళ్ల వరకూ ఎవరైనా వీటిని వాడొచ్చు.
  • ఆ తర్వాత కూడా ఇతర కంటి సమస్యల్లేకుండా ఉంటే వీటిని సజెస్ట్ చేస్తారు.
  • చిన్నపిల్లల్లో మయోపియా పెరగకుండా ఉండేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. స్విమ్మింగ్, ఫుట్ బాల్, మార్షల్ ఆర్ట్స్, రన్నింగ్ వంటి వాటిల్లో రాణించాలనుకునే పిల్లలకు మంచి ఆల్టర్నేట్ అవుతాయి.
  • ఏడాదీ ఆపైన మరికొన్నినెలల వరకూ మన్నుతాయి. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎన్నాళ్లైనా వీటిని కొనసాగించవచ్చు.
  • ఒకప్పుడు వీటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్లే స్వయంగా తయారుచేస్తున్నారు. చైనా, సింగపూర్ వంటి దేశాల్లో అధికంగా వాడే ఈ లెన్సులకి ఈ మధ్యనే మన దగ్గర కూడా ఆదరణ పెరుగుతోందట.

Also Read: https://www.mega9tv.com/technology/all-services-in-one-place-rail-one-super-app-for-tickets-booking-and-food-live-tracking/