‘కింగ్ 100’ ‘మహంతి ఝాన్సీ రాణీ’ గా పవర్ ఫుల్ పాత్రలో టబు..!

అక్కినేని నాగార్జున టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ హీరోల్లో ఒకరు. వైవిధ్యమైన పాత్రలు, విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ దశాబ్దాలుగా వెండితెరపై అలరిస్తున్న ఆయన, ఇప్పుడు తన సినీ ప్రయాణంలో అత్యంత కీలకమైన 100వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయి చిత్రంపై సినీ వర్గాల్లోనూ, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఇప్పటి నుంచే భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మక చిత్రం కింగ్ 100. అక్కినేని లెగసీని దశాబ్దాలుగా ముందుకు తీసుకువెళుతూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్న నాగార్జున సినీ ప్రయాణంలో ఇదొక మైలురాయి. అన్నపూర్ణ స్టూడియోస్, టీ-సిరీస్ సౌత్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున బర్త్ డే రోజు రిలీజైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవల ఈ చిత్రబృందం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. హిట్ పెయిర్ టబు అండ్ నాగ్ రియూనైట్ వన్స్ అగైన్.. బట్ దిస్ టైమ్, ఇట్స్ నాట్ లవ్ ...అంటూ ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. కాగా, ఆమె బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఆమె పాత్రకు సంబంధించిన గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో టబు ఎంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోందో ఇందులో చూపించారు. ‘మహంతి ఝాన్సీ రాణీ’ గా పవర్ ఫుల్ లుక్ తో ఆమె అదరగొడుతున్నారు. ఈ స్థాయి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ గ్లింప్స్ తో సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెంచేశారు. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కు ప్రాణం మ్యూజిక్. నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కింగ్ 100 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. టబుతో పాటు ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి , సుస్మితా భట్, విజయేంద్ర లాంటి పవర్ ఫుల్ కాస్టింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో, అంటే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కింగ్ నాగార్జున ఇప్పటివరకు అనేక బ్లాక్బస్టర్ చిత్రాలతోపాటు క్లాసిక్ సినిమాలను అందించారు. దాంతో ఈ ల్యాండ్ మార్క్ మూవీ రూపుదిద్దుకుంటున్న తీరుపై అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు.
అభిమానుల నమ్మకానికి, నటుడి అంకితభావానికి ప్రతీకగా నిలిచేలా ఈ సినిమా డిజైన్ అవుతోంది. నాగార్జున తన కెరీర్లో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడరు. అందుకే ఈ 100వ సినిమా ద్వారా మరోసారి తనదైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించేలా పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం, ఈ మైలురాయి చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత రికార్డు స్థాయి విజయంతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తుందని గట్టి నమ్మకం వ్యక్తమవుతోంది. అక్కినేని అభిమానుల ఆశయాలకు, సినీ ప్రియుల నిరీక్షణకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ సినిమా నిలుస్తుందని, నాగార్జున సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఇది మరో మరుపురాని అధ్యాయంగా ఫ్యాన్స్ అందరూ ఆశాభావంతో ఉన్నారు.
వీడియో
YouTube వీడియో



