మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే అదిరిపోయే ఫ్యాషన్.. ఈ సింపుల్ టిప్స్తో ట్రెండీగా కనిపించండి..!
కామెంట్లు (0)

పండుగల సీజన్ వచ్చేసింది. సరికొత్తగా కనిపించాలని అందరికీ ఉంటుంది. కొంతమందైతే అలంకార ప్రియులే. మరికొందరు ఉన్నంతలో సరికొత్తగా కనిపించేందుకు తపిస్తుంటారు. దిగువ మధ్యతరగతి వర్గాల వారికి ఉపయోగపడే విధంగా కొత్తగా తక్కువ ఖర్చులో ఎలా ఆకర్షణీయంగా ఉండవచ్చు బడ్జెట్ లోనే కొన్ని టిప్స్ పాటిస్తే సూపర్ లుక్. స్టైలిష్గా కనిపించాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు, విలాసవంతమైన యాక్సెసరీస్ లేకుండానే మన లుక్ను ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. సరైన దుస్తులను ఎంచుకోవడం, వాటిని చక్కగా ధరించడం, మన వ్యక్తిత్వానికి తగిన స్టైల్ను అనుసరించడం ద్వారా తక్కువ బడ్జెట్లోనే అందంగా, కాన్ఫిడెంట్గా కనిపించవచ్చు. ఆడవారైనా, మగవారైనా కొన్ని సింపుల్ ఫ్యాషన్ టిప్స్ పాటిస్తే తమ రోజువారీ లుక్లో మంచి మార్పును చూసుకోవచ్చు.
స్టైలిష్గా కనిపించడానికి ముందుగా దుస్తుల ఫిట్టింగ్ చాలా ఇంపార్టెంట్. మరీ బిగుతుగా లేదా మీ శరీరాకృతికి సరిపోయే దుస్తులు ధరించడం మంచిది. మహిళలు తమకు నప్పే కుర్తీలు, టాప్స్, జీన్స్, ట్రౌజర్స్ లేదా చీరలను ఎంచుకోవచ్చు. పురుషులు సరైన ఫిట్టింగ్ ఉన్న షర్ట్స్, టీ-షర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్ను ధరించవచ్చు. ఖరీదైన దుస్తుల కంటే చక్కగా ఫిట్ అయ్యే దుస్తులు మీ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి.
అలాగే వీటికి కలర్ కాంబినేషన్స్ కూడా ముఖ్యం. బేసిక్ కలర్స్తో కొత్త లుక్స్ ట్రై చేయండి. నలుపు, తెలుపు, నేవీ బ్లూ, గ్రే, బేజ్ వంటి కలర్స్ ఎక్కువ కాంబినేషన్లకు బాగుంటాయి. ఇటువంటి రంగులతో తక్కువ దుస్తులతోనే అనేక రకాల లుక్స్ను క్రియేట్ చేయవచ్చు. ఉమహిళలు న్యూట్రల్ కలర్స్తో పాటు తమకు నచ్చిన నిండు రంగులను కూడా ఉపయోగించవచ్చు. కలర్స్ ను సరిగ్గా ఎంచుకోవడంతో సాధారణ దుస్తులు కూడా స్టైలిష్గా కనిపిస్తాయి. ప్రతి సందర్భానికి కొత్త దుస్తులు కొనడం కంటే ఒకదానితో మరొకటి సులభంగా కలిసే దుస్తులను కొనుగోలు చేయడం మంచిది. ఉదాహరణకు, ఒక జత జీన్స్ ను రెండు లేదా మూడు షర్ట్స్, టాప్స్ లేదా టీ-షర్ట్స్తో వేర్వేరు విధాలుగా ధరించవచ్చు. అలాగే తక్కువ బడ్జెట్లో మంచి దుస్తులు కొనాలంటే షాపింగ్ చేసేటప్పుడు తొందరపడకూడదు. స్థానిక మార్కెట్లు, డిస్కౌంట్ స్టోర్లు, సీజనల్ సేల్స్, నమ్మకమైన ఆన్లైన్ స్టోర్లలో ధరలను కంపేర్ చేసుకుని చూసుకోవాలి. కొన్నిసార్లు స్థానిక దుకాణాల్లోనే తక్కువ ధరకు మంచి నాణ్యత కలిగిన దుస్తులు లభిస్తాయి. ఆన్లైన్లో కొనుగోలు చేసేటప్పుడు సైజ్ చార్ట్, ఫాబ్రిక్ ఎటువంటిది, మనకు నచ్చకపోతే రిటర్న్ చేసే విధంగా పాలసీ కూడా చూసుకోవాలి. కస్టమర్ రివ్యూలను పరిశీలించాలి. డిస్కౌంట్ ఉందని అవసరం లేని వస్తువులు కొనకుండా, నిజంగా ఉపయోగపడే దుస్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి.
స్టైలింగ్ లో బట్టలతో పాటు చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా మీ లుక్లో మంచి మార్పును తీసుకురాగలవు. మహిళలు సింపుల్ ఇయర్రింగ్స్, వాచ్, చిన్న హ్యాండ్బ్యాగ్, బెల్ట్ లేదా స్కార్ఫ్తో తమ దుస్తులకు కొత్త అట్రాక్షన్ ను యాడ్ చేసుకోవచ్చు. అలాగే పురుషులు వాచ్, బెల్ట్, వాలెట్, సింపుల్ బ్రేస్లెట్ లేదా దుస్తులకు సరిపోయే షూస్తో స్టైలిష్ గా అదరగొట్టేయొచ్చు. అయితే ఒకేసారి ఎక్కువ యాక్సెసరీస్ ఉపయోగించడం కంటే, దుస్తులకు సరిపోయే కొన్నింటిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. స్టైలిష్గా కనిపించడానికి కొత్త దుస్తులే అవసరం లేదు. మీ దగ్గర ఉన్న పాత దుస్తులను కొత్త పద్ధతుల్లో ఉపయోగించుకున్నా ఒక్కోసారి ట్రెండీగా ఉంటాయి. ఇకపోతే మంచి ఫ్యాషన్ అనేది కేవలం దుస్తులతోనే పరిమితం కాదు. శుభ్రంగా ఉండటం,హెయిర్ ను నీట్ గా మెయింటైన్ చేసుకోవడం, గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, ముఖానికి మినిమమ్ కేర్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మహిళలు తమకు నచ్చిన సింపుల్ హెయిర్స్టైల్తో పాటు అవసరమైతే తక్కువ మేకప్తో సహజమైన లుక్ను పొందవచ్చు. ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులన్నీ కొనాల్సిన అవసరం లేదు. మీ అవసరాలకు సరిపోయే ప్రాథమిక సంరక్షణ అలవాట్లను పాటించడం ద్వారా శుభ్రంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించవచ్చు. మీ ప్రాంతానికి తగినట్లు అంటే ఆఫీస్, కాలేజ్, ఫంక్షన్, పార్టీ లేదా రోజువారీ పనులు ఇలా ప్రతి సందర్భానికి ఒకే రకమైన దుస్తులు సరిపోవు. అందుకే ఎక్కడికి వెళ్తున్నామో దానికి అనుగుణంగా దుస్తులను ఎంపిక చేసుకోవడం ఆఫీస్కు సింపుల్ షర్ట్స్, ట్రౌజర్స్ లేదా ఫార్మల్ కుర్తీలు బాగుంటాయి. కాలేజ్ లేదా బయటకు వెళ్లేటప్పుడు జీన్స్, టీ-షర్ట్స్, క్యాజువల్ టాప్స్, కుర్తీలు వంటి సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవచ్చు. ఫంక్షన్ల కోసం ఇప్పటికే ఉన్న సంప్రదాయ దుస్తులను కొత్త యాక్సెసరీస్తో కలిపి ధరించవచ్చు. సందర్భానికి తగిన దుస్తులు ధరించడం వల్ల అనవసరమైన షాపింగ్ ఖర్చు తగ్గడమే కాకుండా మీ లుక్ కూడా సహజంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్టైలిష్గా కనిపించడానికి ఖరీదైన బ్రాండ్లు లేదా ట్రెండింగ్ దుస్తులే వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన, సౌకర్యవంతమైన దుస్తులను ఆత్మవిశ్వాసంతో వేసుకుని అదరగొట్టండి. వచ్చిన ప్రతి ఫ్యాషన్ ట్రెండ్ను అనుసరించకుండా, మీ వ్యక్తిత్వానికి సరిపోయే స్టైల్ను ఎంచుకోండి. మీ బడ్జెట్ను ముందుగానే నిర్ణయించుకుని, అవసరమైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వండి. దుస్తుల నాణ్యత, ఫిట్టింగ్, రంగుల కలయిక, పరిశుభ్రత వంటి అంశాలపై శ్రద్ధ పెడితే తక్కువ ఖర్చుతోనే మంచి ఫ్యాషన్ సెన్స్ను పెంపొందించుకోవచ్చు.
తక్కువ బడ్జెట్లో స్టైలిష్గా కనిపించడం అనేది ఖర్చు చేసే డబ్బుపై కాకుండా, మనం ఎంచుకునే దుస్తులు, వాటిని ధరించే విధానం, మన వ్యక్తిగత శైలిపై ఆధారపడి ఉంటుంది. ఆడవారైనా, మగవారైనా ఈ సులభమైన టిప్స్ను పాటిస్తూ తమ స్టైలింగ్ తో అదరగొట్టొచ్చు. అవసరానికి తగ్గట్టుగా షాపింగ్ చేయడం, ఉన్న దుస్తులను కొత్తగా ఉపయోగించడం, పరిశుభ్రతను పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతోనే ఎట్రాక్టివ్ గా కనిపించవచ్చు.
