అన్నీ లాక్కున్నారు…డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను వెన్నుపోటు పొడిచింది ఎవరో తెలుసా.. ?

టాలీవుడ్లో ఆయనొక బ్రాండ్. ఆయన రాసే ప్రతి డైలాగ్‌లో ఒక పొగరు ఉంటుంది.. తీసే ప్రతి సినిమాలో ఒక ఫైర్ ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ను టాలీవుడ్‌కి కొత్తగా పరిచయం చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పోకిరి, ఇడియట్, దేశముదురు, బిజినెస్మెన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసి, వందల కోట్లు సంపాదించిన ఈ స్టార్ డైరెక్టర్ జీవితంలో ఎవరికీ తెలియని ఒక పెద్ద విషాదం ఉంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే ఆకాశానికి ఎత్తేస్తారు, అదే ఫ్లాప్ వస్తే పాతాళానికి తొక్కేస్తారు అని పూరీ జగన్నాథ్ ఎప్పుడూ చెబుతుంటారు. అయితే ఆయన ఫ్లాప్‌ల వల్ల కాకుండా, తాను ప్రాణంగా నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి చేసిన వెన్నుపోటు వల్ల ఏకంగా 100 కోట్లు పోగొట్టుకుని రోడ్డున పడే పరిస్థితికి వచ్చారు. అయినా తన ఆత్మవిశ్వాసంతో వాటన్నింటినీ అధిగమించారు.
పూరీ జగన్నాథ్ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే ఒకప్పుడు ఆయన తీసినవన్నీ సూపర్ హిట్లే. రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలందరితో పని చేశారు. ఒకానొక దశలో పూరీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ. నిర్మాతలకు కాసుల వర్షమే. అలా తన ప్రతిభతో పూరీ జగన్నాథ్ కూడా ఎంతో డబ్బు, ఆస్తులు సంపాదించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భారీ బంగ్లా, కేవ్ పేరుతో అత్యంత విలాసవంతమైన ఆఫీస్ అప్పట్లో హాట్ టాపిక్. కానీ, ఎంత టాలెంట్ ఉన్నా పూరీకి ఒక వీక్నెస్ ఉండేది.. అదే స్నేహం. తన చుట్టూ ఉన్నవాళ్ళను ప్రాణంగా నమ్మేవాడు. ఆర్థిక విషయాలు, ఆస్తుల వ్యవహారాలు, అకౌంట్స్ అన్నీ చూసుకోవడానికి తన అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి చేతిలో పెట్టాడు. సినిమాల హడావుడిలో పడి కనీసం తన అకౌంట్లో ఎంత డబ్బు ఉంది? ఏ ఆస్తి ఎవరి పేరు మీద ఉంది? అని కూడా పూరీ చెక్ చేసుకోలేనంతగా ఆ వ్యక్తిని నమ్మాడు. కళ్లు మూసుకుని బ్లాంక్ చెక్కుల మీద, ప్రాపర్టీ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేశాడు. అదే ఆయన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు.



