జైలర్ 2 కోసం రజినీకాంత్‌కి మిథున్ దాదా పెట్టిన కండిషన్ ఏంటి?

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి ఇప్పుడు తన నెక్స్ట్ మిషన్ జైలర్ 2 తో రాబోతున్నాడు. మొదటి పార్ట్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి హేమాహేమీలు క్యామియోలు చేసి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. మరి పార్ట్ 2 లో అంతకుమించిన స్టార్ కాస్ట్ ఉండాలి కదా? జైలర్ 2 కోసం నెల్సన్ దిలీప్ కుమార్ ఒక భారీ మల్టీస్టారర్ యూనివర్స్‌ను ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం, రజినీకాంత్‌కి ఎదురు నిలబడే విలన్ పాత్ర కోసం బాలీవుడ్ లెజెండరీ హీరో, డాన్సింగ్ స్టార్ మిథున్ చక్రవర్తి ని సంప్రదించారు. అయితే, రజినీకాంత్ సినిమాలో నటించడానికి మిథున్ చక్రవర్తి ఏకంగా రజినీకే ఒక షాకింగ్ కండిషన్ పెట్టారట. సూపర్ స్టార్ రజినీకాంత్,డ్యాన్సింగ్ స్టార్ మిథున్ చక్రవర్తిలు కేవలం కో-స్టార్స్ మాత్రమే కాదు, దశాబ్దాలుగా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ల పరిచయం ఈనాటిది కాదు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం, 1989లో వచ్చిన హిందీ సినిమా భ్రష్టాచార్ లో వీళ్లిద్దరూ తొలిసారిగా కలిసి నటించారు. రమేష్ సిప్పీ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో అనుపమ్ ఖేర్, రేఖ కూడా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత 1995లో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన భాగ్య దేవత అనే బెంగాలీ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక స్పెషల్ క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చారు. స్నేహం కోసం రజినీ ఆ సినిమాలో నటించారు. ఆ తర్వాత 2015లో యాగవరాయినమ్ నా కాక్క సినిమాతో మిథున్ చక్రవర్తి తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత, దాదాపు మూడు దశాబ్దాల గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ జైలర్ 2 స్క్రీన్ మీద కలిసి కనిపించబోతున్నారు. ఒకే ఫ్రేమ్‌లో తలైవా, మిథున్ దాదా కనిపిస్తే ఫ్యాన్స్‌కి పూనకాలు గ్యారెంటీ. రీసెంట్గా జరిగిన జైలర్ 2 సూపర్ షో ఈవెంట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ స్వయంగా ఈ సినిమాలోకి మిథున్ చక్రవర్తి ఎలా వచ్చారో, ఆయన ఏ కండిషన్ పెట్టారో పూసగుచ్చినట్లు చెప్పారు. రజినీ మాటల్లోనే చెప్పాలంటే..నెల్సన్ ఈ కథ రాసుకున్న తర్వాత విలన్ క్యారెక్టర్‌కి మిథున్ అయితే బాగుంటుందని ప్రొడక్షన్ టీమ్ ఆయన్ని సంప్రదించిందట. కానీ మిథున్ దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఏంటి? నేను రజినీకాంత్‌కి విలన్‌గా చేయాలా? పైగా సినిమాలో తను హీరో, నేను విలన్ అంటే రజినీకాంత్ చేతిలో నేను దెబ్బలు తినాలా? నో ఛాన్స్, నేను ఈ సినిమా చేయను, దయచేసి వెళ్లిపోండి అని కరాఖండిగా చెప్పేశారట.



