రజనీకాంత్ సినిమాలో మోహన్ లాల్ కు అవమానం? రచ్చ చేస్తున్న ఫ్యాన్స్!
కామెంట్లు (0)

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద మరోసారి తన స్టామినా ఏంటో చూపిస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ 2 వరల్డ్ వైడ్ గా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఈ మూవీలోని క్యామియో రోల్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. జైలర్ ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్ ఎంట్రీకి థియేటర్లు ఎలా దద్దరిల్లాయో , సెకెండ్ పార్ట్ లో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి. అయితే పార్ట్ 2లో మోహన్ లాల్ క్యారెక్టర్ విషయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మలయాళ ఫ్యాన్స్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోందని సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. ఏకంగా మోహన్ లాల్ టీమ్ కు చెందిన ఒక వ్యక్తి ఓపెన్ గా సోషల్ మీడియాలో డైరెక్టర్ నెల్సన్ పై ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
జైలర్ 2 లో మోహన్ లాల్ కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేసిన ప్రముఖ డిజైనర్ జిషాద్ శామ్ సుదీర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో సినిమా చూసిన జిషాద్ కు ఒక పెద్ద షాక్ తగిలింది. తాను ఎంతో కష్టపడి మోహన్ లాల్ కోసం డిజైన్ చేసిన చాలా కాస్ట్యూమ్స్, అలాగే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు సినిమాలో కనిపించలేదు. అవన్నీ ఎడిటింగ్ లో లేపేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన డిజైనర్ జిషాద్.. వెంటనే ట్విట్టర్ వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టాడు. జైలర్ 2 కోసం మోహన్ లాల్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాల్సి ఉంది. ఆ లుక్స్ కోసం ఎంతో కష్టపడి కాస్ట్యూమ్స్ రెడీ చేశాం, షూట్ కూడా చేశారు. కానీ ఫైనల్ కట్ లో ఆ రెండు లుక్స్ పూర్తిగా కనిపించలేదు. ఆయన నటించిన పలు అద్భుతమైన సన్నివేశాలను కట్ చేసేశారు. మన మలయాళ సూపర్ స్టార్కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇకపై ఏ సినిమా సీక్వెల్స్ లో నేను పనిచేయను అంటూ తన బాధను, కోపాన్ని వ్యక్తపరుస్తూ ఆరోపణలు చేశాడు. ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఇలా ఓపెన్ గా డైరెక్టర్ అండ్ ఎడిటింగ్ టీమ్ పై విమర్శలు చేయడం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారింది.
జిషాద్ చేసిన ఈ ట్వీట్ తో మోహన్ లాల్ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేయడం స్టార్ట్ చేశారు. జైలర్ 1 హిట్ అవ్వడానికి మ్యాథ్యూ క్యారెక్టర్ లో మోహన్ లాల్ చేసిన క్యామియో కూడా ఒక ప్రధాన కారణం. అలాంటిది సెకండ్ పార్ట్ లో ఆయన స్క్రీన్ స్పేస్ తగ్గిస్తారా అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రజనీకాంత్ ఇమేజ్ ని ఎలివేట్ చేయడం కోసం, రన్ టైమ్ ఇష్యూస్ వల్ల, కథా గమనానికి అడ్డుగా ఉన్నాయని భావించి డైరెక్టర్ నెల్సన్ , యు ఆయన టీమ్ ఈ సీన్స్ ను ఎడిటింగ్ రూమ్ లో కట్ చేసి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మల్టీస్టారర్ సినిమాలు, అందులోనూ ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లు ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇవ్వడం ఏ డైరెక్టర్ కైనా కత్తిమీద సామే. హృతిక్ రోషన్, శివరాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి లాంటి వాళ్లందరినీ ఒకే సినిమాలో బ్యాలెన్స్ చేయాలి కాబట్టి, కొన్నిసార్లు ఇలాంటి కోతలు తప్పవని మరికొందరు వాదిస్తున్నారు. కానీ మోహన్ లాల్ లాంటి ఒక లెజెండరీ యాక్టర్ తో షూట్ చేసిన తర్వాత, ఆ సీన్స్ ను తీసేయడం అనేది కరెక్ట్ కాదని, కనీసం ఆ డిలీటెడ్ సీన్స్ నైనా యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే రజనీకాంత్, మోహన్ లాల్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ఇదంతా కేవలం టెక్నికల్ , క్రియేటివ్ డెసిషన్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాదం వల్ల సినిమా కలెక్షన్స్ పై పెద్దగా ప్రభావం పడకపోయినా, మలయాళ ఆడియన్స్ లో మాత్రం కొంత డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ అయింది. ఇలాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు అన్ని భాషల హీరోల ఫ్యాన్స్ మనోభావాలను డైరెక్టర్లు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి జైలర్ 2 ఒక పక్క కలెక్షన్స్ తో దూసుకుపోతుంటే, మరోపక్క ఈ కాస్ట్యూమ్ డిజైనర్ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నుంచి మిథున్ చక్రవర్తి, హృతిక్ రోషన్, విద్యాబాలన్, రమ్యకృష్ణ, యోగిబాబు లాంటి భారీ స్టార్ కాస్ట్ ఉండటంతో సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. అనిరుధ్ తన మ్యూజిక్ తో మరోసారి థియేటర్లను షేక్ చేశాడు. సినిమాకు ఓవరాల్ గా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.



