రజనీకాంత్ సినిమాలో మోహన్ లాల్ కు అవమానం? రచ్చ చేస్తున్న ఫ్యాన్స్!
కామెంట్లు (0)

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద మరోసారి తన స్టామినా ఏంటో చూపిస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ 2 వరల్డ్ వైడ్ గా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఈ మూవీలోని క్యామియో రోల్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. జైలర్ ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్ ఎంట్రీకి థియేటర్లు ఎలా దద్దరిల్లాయో , సెకెండ్ పార్ట్ లో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి. అయితే పార్ట్ 2లో మోహన్ లాల్ క్యారెక్టర్ విషయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మలయాళ ఫ్యాన్స్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోందని సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. ఏకంగా మోహన్ లాల్ టీమ్ కు చెందిన ఒక వ్యక్తి ఓపెన్ గా సోషల్ మీడియాలో డైరెక్టర్ నెల్సన్ పై ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
జైలర్ 2 లో మోహన్ లాల్ కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేసిన ప్రముఖ డిజైనర్ జిషాద్ శామ్ సుదీర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో సినిమా చూసిన జిషాద్ కు ఒక పెద్ద షాక్ తగిలింది. తాను ఎంతో కష్టపడి మోహన్ లాల్ కోసం డిజైన్ చేసిన చాలా కాస్ట్యూమ్స్, అలాగే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు సినిమాలో కనిపించలేదు. అవన్నీ ఎడిటింగ్ లో లేపేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన డిజైనర్ జిషాద్.. వెంటనే ట్విట్టర్ వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టాడు. జైలర్ 2 కోసం మోహన్ లాల్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాల్సి ఉంది. ఆ లుక్స్ కోసం ఎంతో కష్టపడి కాస్ట్యూమ్స్ రెడీ చేశాం, షూట్ కూడా చేశారు. కానీ ఫైనల్ కట్ లో ఆ రెండు లుక్స్ పూర్తిగా కనిపించలేదు. ఆయన నటించిన పలు అద్భుతమైన సన్నివేశాలను కట్ చేసేశారు. మన మలయాళ సూపర్ స్టార్కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇకపై ఏ సినిమా సీక్వెల్స్ లో నేను పనిచేయను అంటూ తన బాధను, కోపాన్ని వ్యక్తపరుస్తూ ఆరోపణలు చేశాడు. ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఇలా ఓపెన్ గా డైరెక్టర్ అండ్ ఎడిటింగ్ టీమ్ పై విమర్శలు చేయడం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారింది.



