వారణాసి విధ్వంసం షురూ..రిలీజ్‌కు ముందే రూ.850 కోట్లు..షేక్ అవుతున్న బాక్సాఫీస్ రికార్డులు!
కామెంట్లు (0)

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా భారీ సినిమాలతో భారత సినీ పరిశ్రమ స్థాయిని పెంచేసిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆ భారీ ప్రతిష్టాత్మక చిత్రమే వారణాసి. సుమారు 1000 కోట్లకు పైగా కళ్లు చెదిరే బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తోంది. అసలు సినిమా రిలీజ్ కాకముందే, షూటింగ్ దశలో ఉండగానే.. ఈ సినిమా ఏకంగా 850 కోట్లను రికవరీ చేసిందన్న వార్త ఇప్పుడు ట్రేడ్ పండితుల మైండ్ బ్లాంక్ చేస్తోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వారణాసి ఓటీటీ వ్యాపారంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతోంది.
టైమ్ ట్రావెల్ , రామాయణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఒక యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కాబట్టి, గ్లోబల్ ఆడియన్స్ కు ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ బలంగా నమ్ముతున్నాయి. సినీ వర్గాల నుంచి అందుతున్న పక్కా సమాచారం ప్రకారం.. వారణాసి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 650 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒక ఇండియన్ సినిమాకు కేవలం డిజిటల్ రైట్స్ రూపంలోనే 650 కోట్లు రావడం ఇదే తొలిసారి. అంటే ఓటీటీ హక్కుల ద్వారానే సినిమా నిర్మాణ వ్యయంలో దాదాపు 80 శాతానికి పైగా బడ్జెట్ వెనక్కి రావడం విశేషం. దీనికి తోడు, ఆడియో హక్కులను ప్రముఖ టీ-సిరీస్ సంస్థ 50 కోట్లకు దక్కించుకుందని సమాచారం. ఇక టీవీల్లో ప్రసారం చేసే శాటిలైట్ హక్కులు కూడా అన్ని భాషల్లో కలిపి సుమారు 150 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది. అంటే కేవలం నాన్-థియేట్రికల్ వ్యాపారం ద్వారానే ఈ సినిమా సుమారు 850 కోట్లు బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.



