POK వెంటనే అప్పగించేయాల్సిందే..పాకిస్థాన్‌కు ఫైనల్ అల్టిమేటం!

భారత భూభాగాన్ని ఆక్రమించుకుని, అక్కడి నుంచి దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశ సార్వభౌమాధికారం కిందకు వస్తుందని, దాన్ని భారత్ నుండి విడదీయడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేసింది. చరిత్రను ఒకసారి తిరగేస్తే, 1947 అక్టోబర్‌లో అప్పటి జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్.. తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ అధికారిక పత్రాలపై సంతకం చేశారు. చట్టబద్ధంగా కాశ్మీర్ మొత్తం భారతదేశానిదే. కానీ ఆ తర్వాత పాకిస్థాన్ గిరిజనుల ముసుగులో సైన్యాన్ని పంపి కాశ్మీర్‌లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్.ఇప్పుడు ఆ భూభాగాన్ని పాకిస్థాన్ వెంటనే ఖాళీ చేసి, భారతదేశానికి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాశ్మీర్ మాదే అని పాకిస్థాన్ ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై నాటకాలు ఆడుతుంటుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మన జమ్మూ కాశ్మీర్ దశ తిరిగిపోయింది. ఎటుచూసినా కొత్త హైవేలు, స్మార్ట్ సిటీలు, ఎయిమ్స్ , ఐఐటీ లాంటి విద్యా సంస్థలతో కాశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో పర్యాటకులు క్యూ కడుతున్నారు. కానీ బోర్డర్ అవతల ఉన్న పీఓకే పరిస్థితి చూస్తే దారుణంగా ఉంటుంది. కనీస మౌలిక వసతులు, సదుపాయాలు లేకుండా ఇన్నాళ్లూ వాళ్లను పాక్ సైన్యం ఒక బానిసల్లా చూసింది. తమ హక్కుల కోసం రోడ్లపైకి వస్తే పాక్ రేంజర్లు వారిపై కాల్పులు జరిపి చంపేస్తున్నారు. ఈ వాస్తవాలను బీజేపీ నేతలు ఎత్తిచూపుతున్నారు. అభివృద్ధి అంటే ఏంటో భారత్‌ను చూసి నేర్చుకోవాలని, మీ సొంత ప్రజలకే తిండి పెట్టలేని స్థితిలో ఉండి, కాశ్మీర్ గురించి మాట్లాడే నైతిక హక్కు పాకిస్థాన్‌కు లేదని తెగేసి చెప్తున్నారు.
ఇప్పుడు పీవోకే ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు పాకిస్థాన్ మాయమాటలు నమ్మిన పీఓకే ప్రజలు, ఇప్పుడు వాస్తవం గ్రహించారు. లైన్ ఆఫ్ కంట్రోల్ కు అవతల ఉన్న తమ బంధువులు, సోదరులు కాశ్మీర్లో ఎంత సంతోషంగా ఉన్నారో వారు కళ్లారా చూస్తున్నారు. ఇటీవల ముజఫరాబాద్, గిల్గిట్-బాల్టిస్తాన్ లాంటి ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ నిరసనల్లో ఎందరో యువకులు, స్థానికులు పాకిస్థాన్ ఆర్మీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దమ్ముంటే సరిహద్దులు తెరవండి, మేం ఇండియాలోకి వెళ్లిపోతాం అంటూ పాక్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పీఓకేలో నెలకొన్న ఈ అసంతృప్తి పాకిస్థాన్‌కు అతిపెద్ద తలనొప్పిగా మారింది. పీఓకే ప్రజలు తమను తాము భారతీయులుగా గుర్తించే రోజు ఎంతో దూరంలో లేదని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా చెబుతున్నాయి. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దివాళా తీసిన స్థితిలో ఉంది. వాళ్ల దేశాన్ని వాళ్లు పోషించుకోవడమే గగనంగా మారింది. ఇలాంటి టైమ్‌లో పీఓకేలో చెలరేగుతున్న ఆందోళనలను పాక్ సైన్యం ఎక్కువ కాలం అణచిపెట్టలేదు. ప్రజల తిరుగుబాటు తీవ్రమైతే, పాకిస్థాన్ చేతులెత్తేయక తప్పదు. అదే సమయంలో, ఉగ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో ఇండియన్ ఆర్మీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది. ఏ క్షణమైనా సర్జికల్ స్ట్రైక్స్ లాంటి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం సైన్యానికి ఇచ్చింది. ఇలా అటు అంతర్గత తిరుగుబాటు, ఇటు భారత సైన్యం భయంతో పాకిస్థాన్ పీఓకేపై తన పట్టును కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అఖండ భారతదేశంలో పీఓకే ఒక భాగం. దాన్ని తిరిగి పొందడం అనేది ప్రతి భారతీయుడి కల. ఈ కలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని బీజేపీ నేతల మాటలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్థాన్ స్వచ్ఛందంగా పీఓకేను అప్పగిస్తే మంచిది, లేదంటే కాలమే వారికి గుణపాఠం చెబుతుందని విశ్లేషకులు అంటున్నారు. దశాబ్దాల పాక్ ఆక్రమణకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.



