RAPO23.. రామ్ డైరెక్షన్.. పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రితీష్ దేశ్ ముఖ్
కామెంట్లు (0)

ఎనర్జిటిక్ స్టార్, రామ్ పోతినేని తన కెరీర్లో సరికొత్త అడుగు వేయబోతున్న సంగతి తెలిసిందే. ఆయనే తన సొంత డైరెక్షన్ లో చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది రామ్ కు 23వ చిత్రం. డైరెక్టర్ గా ఫస్ట్ ప్రయత్నంలోనే రామ్ ఒక అద్భుతమైన సైకలాజికల్ యాక్షన్ త్రిల్లర్ స్టోరీని ఎంచుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. రామ్ సెట్ చేసిన కాస్టింగ్ చూస్తే మాత్రం ఆయన ప్లానింగ్ వేరే లెవెల్లో ఉందని అర్థమవుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌తో బాలీవుడ్ విలక్షణ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ నేరుగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం గమనార్హం. రితేష్ దేశ్‌ముఖ్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన విలక్షణ నటుడు కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించగలడు, అదే సమయంలో ఏక్ విలన్ లాంటి సినిమాలో సైకో కిల్లర్‌గా నటించి భయపెట్టగలడు. రైడ్ 2 , బ్లాక్‌బస్టర్ మరాఠీ మూవీ రాజా శివాజీ వంటి చిత్రాల్లో తనదైన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన రితేష్.. ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. రామ్ పోతినేని కొత్త సినిమా తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఒక భారీ షూటింగ్ షెడ్యూల్లో రితేష్ దేశ్‌ముఖ్ జాయిన్ అయ్యారు. ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టగానే డైరెక్టర్ కమ్ హీరో రామ్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ను ఆత్మీయంగా హగ్ చేసుకున్న ఓ బీటీఎస్ వీడియోను చిత్ర యూనిట్ అఫీషియల్ గా వదిలింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారుతూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది.
స్క్రీన్ మీద రామ్ , రితేష్ దేశ్‌ముఖ్ మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ ఆడియన్స్ కు ఒక కొత్త థ్రిల్ ఇవ్వబోతున్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. టాలీవుడ్ గోల్డెన్ లెగ్, లక్కీ ఛార్మ్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ సంయుక్త ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా నటిస్తుండటం ప్రాజెక్ట్‌కు మరింత గ్లామర్‌ను అద్దింది. సాలిడ్ పర్ఫార్మెన్స్ తో పాటు లక్ కూడా ఉన్న సంయుక్త రావడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని అత్యంత భారీ వ్యయంతో, ఎక్కడా కాంప్రమైజ్ కాని నిర్మాణ విలువలతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.



