ఆగిపోలేదు..మొదలైంది!నో హీరోయిన్..నో రొమాన్స్!బన్నీ కెరీర్లోనే అతిపెద్ద ప్రయోగంగా AA23?
రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇచ్చిన ఒక హింట్ బన్నీ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కంటే ముందే, ఈ ఏడాది జనవరిలో బన్నీ 23వ సినిమా పై ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్నట్లు వచ్చిన ఆ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో.. సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇచ్చిన ఒక హింట్ బన్నీ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. జనవరిలో వచ్చిన AA23 అనౌన్స్మెంట్ వీడియో అప్పట్లో ఆన్లైన్లో ఒక పెద్ద సెన్సేషన్. ఆ చిన్న క్లిప్ చూసి ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా మిలియన్ కు పైగా రీల్స్ క్రియేట్ అయ్యాయి. ఆ స్థాయి బజ్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆ తర్వాత మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనికి తోడు లోకేష్ కనగరాజ్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవ్వడం.. బన్నీ ఏమో అట్లీతో రాకా మూవీ షూటింగ్ కు వెళ్లిపోవడంతో, ఈ కాంబినేషన్ క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. బహుశా స్టోరీ సెట్ అవ్వలేదేమో, లేదా డేట్స్ అడ్జస్ట్ కాక ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారేమో అని ట్రేడ్ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరిగింది. కానీ, ఈ రూమర్లలో ఎలాంటి నిజం లేదని, ప్రాజెక్ట్ ఆన్ ట్రాక్ లోనే ఉందని తాజాగా తేలిపోయింది.
బన్నీ అభిమానులు నిరాశలో ఉన్న టైంలోనే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ఉన్న ఒక కొత్త ఫోటోను షేర్ చేశారు. కేవలం ఫోటో మాత్రమే కాకుండా, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కమింగ్ సూన్ అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ జతచేశారు. అంటే AA23 ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదని, బన్నీతో కలిసి ఆయన వర్క్ చేస్తున్నారని ఈ పోస్ట్ తో అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. గత కొద్ది నెలలుగా ఈ సినిమా స్క్రిప్ట్ డెవలప్మెంట్, లొకేషన్ల వేటను లోకేష్ టీమ్ చాలా సైలెంట్ గా పూర్తి చేస్తోందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమా షూటింగ్ ఎండింగ్ స్టేజ్ కు రాగానే, బన్నీ నేరుగా లోకేష్ కనగరాజ్ సెట్స్ లోకి అడుగుపెడతారని సమాచారం. లోకేష్ మార్క్ హై- యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఒక పవర్ ఫుల్ టైటిల్ టీజర్ ను కూడా మేకర్స్ కట్ చేస్తున్నారట. త్వరలోనే ఈ టీజర్ తో ఫ్యాన్స్ కు అసలైన సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని టాక్.
ఈ సినిమా గురించి తెలిసిన మరో ఇన్సైడ్ టాక్ ఏంటంటే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ ఉండదట. అవును మీరు విన్నది నిజమే. సాధారణంగా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్లకు, రొమాంటిక్ ట్రాక్స్ కు పెద్దగా స్కోప్ ఉండదు. ఖైదీ సినిమాలో అసలు హీరోయినే ఉండదు, విక్రమ్ లాంటి సినిమాల్లో కూడా యాక్షన్, ఎమోషన్స్ కే పెద్ద పీట వేశాడు. ఇప్పుడు బన్నీతో చేయబోయే AA23 కూడా ఇదే ఫార్ములాలో, పూర్తిగా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా సాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రతో పాటు ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ కానీ, డ్యూయెట్స్ కానీ ఉండవని సినీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. బన్నీ లాంటి ఒక స్టైలిష్ అండ్ మాస్ హీరోకి, గ్లామర్ అండ్ రొమాంటిక్ టచ్ లేకుండా పూర్తిగా ఒక రా అండ్ రస్టిక్ రోల్ డిజైన్ చేయడం ఆయన కెరీర్లోనే అతిపెద్ద ప్రయోగంగా చెప్పొచ్చు. కథలో కేవలం బ్లడ్, గన్స్, ఎమోషన్స్ కు మాత్రమే ప్రాధాన్యం ఉంటుందట.
లోకేష్ సినిమా అంటే ఆటోమేటిక్ గా అనిరుధ్ రవిచందర్ పేరే గుర్తొస్తుంది. అల్లు అర్జున్, లోకేష్, అనిరుధ్.. ఈ ముగ్గురి కాంబినేషన్ వింటుంటేనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్లోబల్ స్టాండర్డ్స్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అట్లీ సినిమాతో పాన్ ఇండియాలో తన బేస్ ను మరింత స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోయే ఈ యాక్షన్ ఫెస్ట్ బన్నీ కెరీర్ ని ఇంకో రేంజ్ కి తీసుకెళ్తుంది. మరి ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి వస్తుందా? లేదా కొత్త కథా? అన్న సస్పెన్స్ త్వరలోనే వీడనుంది.



