ఎన్టీఆర్ డ్రాగన్ లోకి ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్..?

దేవర తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్. ఈ సినిమాలో తారక్ ను మునుపెన్నడూ చూడని రీతిలో ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా చూపించబోతున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ అత్యంత శక్తిమంతమైన లూగర్ అనే పాత్రని పోషిస్తున్నారు. లూగర్ అంటేనే ఒక జర్మన్ డెడ్లీ వెపన్. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని పక్కా ప్రణాళికతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.ఇక ప్రశాంత్ నీల్ సినిమాలకు ఆ రేంజ్ క్రేజ్ రావడానికి ఆయన విజన్ ఎంత కారణమో, ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇచ్చే కళ్లుచెదిరే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే కారణం. కేజీఎఫ్ సిరీస్ అయినా, సలార్ అయినా థియేటర్ల స్పీకర్లు బద్దలయ్యేలా రవి బస్రూర్ తన మ్యూజిక్ తో మేజిక్ చేశాడు. సహజంగానే డ్రాగన్ సినిమాకి కూడా రవి బస్రూరే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన డ్రాగన్ టైటిల్ అనౌన్స్మెంట్ ప్రచార చిత్రానికి ఆయనే అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. అంతా బాగానే ఉంది అనుకున్న టైమ్ లో.. చిత్రబృందం ఒక ఊహించని డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని కొన్ని పాటల కోసం, ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఫీల్ కోసం బాలీవుడ్ సెన్సేషన్, ధురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్దేవ్ ని రంగంలోకి దింపాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ధురంధర్ లాంటి మ్యూజికల్ హిట్ ఇచ్చిన శాశ్వత్ సచ్దేవ్ ని రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే డ్రాగన్ కు విజువల్స్ తో పాటు మ్యూజిక్ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవ్వడం ఖాయం. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రావల్సి ఉంది. ఒక సినిమా కోసం ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో మనం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్.. వీటికి తోడు రవి బస్రూర్ బీజీఎమ్, శాశ్వత్ సచ్దేవ్ సాంగ్స్ తోడైతే లూగర్ విధ్వంసానికి బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదని ఈ మార్పులతో అర్థమవుతోంది.



