సినిమా రిలీజ్‌కు ముందే ప్రమోషన్లతో హైప్.. అనిల్ రావిపూడి మార్క్

సినిమా ఎంత బాగా తీసినా, దాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేసేలా ప్రమోట్ చేయడం ఒక ఆర్ట్. ఆ ఆర్ట్‌లో అనిల్ రావిపూడి మాస్టర్ అని మరోసారి ప్రూవ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి వినూత్నమైన ప్రమోషన్స్ అంటే టక్కున గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. కేవలం సినిమాలు తీయడమే కాదు, ఆ సినిమాను ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లాలి, రిలీజ్‌కు ముందే ఆడియన్స్ మదిలో మెదిలే విధంగా ప్రమోషన్స్ చేయడంలో అనిల్ దిట్ట. గతంలో సంక్రాంతికి వస్తున్నాం , మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలకు అనిల్ చేసిన వెరైటీ ప్రమోషన్స్ ఒక రేంజ్లో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి అనిల్ రావిపూడి తన మార్క్ ఫన్ ప్రమోషన్స్ కు తెరలేపాడు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా ఆయన తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ జనవరి 12 విడుదల కోసం సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలన్నింటి కంటే ముందే ప్రచారాన్ని మొదలుపెట్టేశాడు.
సంక్రాంతి సీజన్ అంటేనే టాలీవుడ్ లో పెద్ద సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని అందరికంటే ముందుగానే జనాల్లోకి తీసుకెళ్లాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యాడు. సాధారణంగా సినిమా విడుదలకు నెల రోజుల ముందు ప్రమోషన్స్ మొదలుపెడతారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉండగానే, నవంబర్ 20 నుంచే జనవరి 12 విడుదల మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలకు చేసిన వినూత్న ప్రచారం సినిమాలు భారీ విజయం సాధించడానికి ఎంతగానో దోహదపడింది. ఇక తాజాగా చేసిన ప్రమోషన్ వీడియోలో సూపర్‌స్టార్ రజనీకాంత్, శోభన నటించిన కల్ట్ క్లాసిక్ దళపతి సినిమాలోని ఐకానిక్ సీన్‌ను ఎంచుకున్నాడు. ఆ సీన్‌ను అనిల్ రావిపూడి, హీరోయిన్ కృతి శెట్టి, కీర్తి సురేశ్ కలిసి అత్యంత ఫన్నీగా రీక్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఇలాంటి ఎంటర్టైనింగ్ ప్రోమోతో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడంతో ప్రేక్షకుల్లో జనవరి 12 విడుదలపై ఒక్కసారిగా ఆసక్తి మరింత పెరిగిపోయింది.
వీడియో
YouTube వీడియో



