ఎంగేజ్మెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ పోస్ట్ ఇదే..విషెస్ చెబుతున్న మెగా ఫ్యాన్స్..!

ప్రముఖ సినీనటుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తన లైఫ్ లో ఒక కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన కిరణ్ తో తేజుకి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక తర్వాత తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫస్ట్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ గా మారింది. నవంబర్ 5న హైదరాబాద్లోని అత్యంత విలాసవంతమైన హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ వేదికగా సాయి దుర్గ తేజ్, కిరణ్ ల నిశ్చితార్థ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఎలాంటి మీడియా ఆర్భాటం లేకుండా, కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు అటు అల్లు ,ఇటు కొణిదెల కుటుంబాలకు చెందిన సభ్యులందరూ హాజరై సందడి చేశారు. వీరితో పాటు తేజుకి అత్యంత ఆప్తులైన మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి, నవీన్ విజయ కృష్ణ, హర్ష , డైరెక్టర్ వెంకీ కుడుముల, హీరో నవదీప్ లాంటి ఇండస్ట్రీ స్నేహితులు కూడా ఈ ఎంగేజ్మెంట్ లో పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు.
ఈ ఎంగేజ్మెంట్ ఫోటోను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో కంగ్రాట్స్ చెబుతూ ఫోటోను షేర్ చేశారు. ఇక తాజాగా సాయి ధరమ్ తేజ్ కూడా తన నిశ్చితార్థ ఫొటోను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నెటిజన్ల మనసులను దోచుకుంటోంది. తన కాబోయే భార్య కిరణ్తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో చేయి వేసి నడిచి వస్తున్న ఒక అందమైన ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోతో పాటు ఐ లవ్ యూ అంటూ తన ప్రేయసిపై ఉన్న ప్రేమను తెలియజేసేలా క్యాప్షన్ రాసుకొచ్చారు. కిరణ్మయి సాయి దుర్గ తేజ్ కు ఎప్పటినుంచో పరిచయం ఉన్న తన స్నేహితురాలే . వీళ్ల స్నేహం ప్రేమగా మారి, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక ఈ జంట వివాహం డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్లోనే అత్యంత ఘనంగా జరగబోతోందని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఇదిలా ఉంటే తేజ్ నటించిన సంబరాల యేటి గట్టు చిత్రం సంక్రాంతి బరిలో నిలిచేందుకు రెడీ అవుతోంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.



