దీపావళి ధమాకా..రామాయణ రికార్డులు

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన రామాయణ - పార్ట్ 1 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తోంది. భారీ అంచనాల నడుమ నవంబర్ 5న విడుదలైన రామాయణ చిత్రానికి మొదటి షో నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ వర్క్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మొదటి రోజు ఈ చిత్రం ఇండియాలో అన్ని భాషల్లో కలుపుకుని ఏకంగా 64 కోట్ల 85 లక్షల నెట్ వసూళ్లు సాధించింది. ఇక రెండో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా 48 కోట్లు రాబట్టింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఇండియాలో 112 కోట్ల 90 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్కలు చూసుకుంటే.. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 221 కోట్ల రూపాయల భారీ గ్రాస్ ను సొంతం చేసుకుంది. గతంలో ఓం రౌత్, ప్రభాస్ కాంబోలో వచ్చిన ఆదిపురుష్ రెండు రోజుల్లో 215 కోట్ల 78 లక్షలు రాబట్టగా, ఇప్పుడు ఆ రికార్డును నితీష్ తివారీ రామాయణం అవలీలగా బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.
ఒక బాలీవుడ్ సినిమాకు సౌత్ లో, ముఖ్యంగా కర్ణాటకలో ఇంత రేంజ్ కలెక్షన్స్ రావడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. రామాయణ చిత్రానికి హిందీ తర్వాత అత్యధికంగా కలెక్షన్స్ తెచ్చిపెట్టింది కన్నడ బాక్సాఫీస్ మాత్రమే. మొదటి రెండు రోజుల్లోనే కన్నడ వెర్షన్ సుమారు రూ.12 కోట్ల 40 లక్షల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది. ఒక బాలీవుడ్ డబ్బింగ్ సినిమాకు కన్నడనాట ఇది ఆల్ టైమ్ రికార్డ్. దీనికంతటికీ ఏకైక కారణం రాకింగ్ స్టార్ యశ్. కేజీఎఫ్ సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన యశ్.. ఇందులో రావణుడి పాత్ర పోషించడంతో కర్ణాటకలో ఫ్యాన్స్ థియేటర్ల ముందు జాతర చేస్తున్నారు. ఈ సినిమాలో యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్లకు ఆయన అతిపెద్ద ప్లస్ పాయింట్ గా మారారు. తెలుగులో కూడా ఈ చిత్రం రెండు రోజుల్లో సుమారు 10 కోట్ల 75 లక్షల నెట్ వసూళ్లు సాధించి సూపర్ స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. సాయి పల్లవి సీతగా నటించడం తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.



