తమన్నా ఫిజిక్ పై అసభ్యకరమైన కామెంట్స్…మిల్కీ బ్యూటీ రిప్లైకి మైండ్ బ్లాక్

సౌత్ నుండి నార్త్ వరకు అన్ని ఇండస్ట్రీల్లోనూ స్టార్ హీరోలతో నటించి అగ్ర హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా ప్రత్యేక గీతాలలో కూడా అలరిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది నటి తమన్నా భాటియా. ఈ మిల్కీ బ్యూటీ క్రేజ్ ఈ మధ్య కాలంలో మరింత పీక్స్‌కు చేరుకుంది. కానీ, గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటే ప్రశంసలతో పాటే విమర్శలు, ఒక్కోసారి అత్యంత అభ్యంతరకరమైన కామెంట్స్ కూడా వస్తుంటాయి. తమన్నా విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. గతంలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అన్నూ కపూర్ తాజాగా ఆమె లుక్స్, బాడీ ఫిజిక్ పై చేసిన ఒక కాంట్రవర్షియల్ కామెంట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఏకంగా ఆమె బాడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న తమన్నా, తాజాగా ఈ వివాదంపై నోరు విప్పింది. తనదైన స్టైల్ లో, చాలా మెచ్యూర్డ్ గా అన్నూ కపూర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
స్త్రీ 2 సినిమాలోని ఆజ్ కీ రాత్ సాంగ్ యూట్యూబ్ ను ఏ విధంగా షేక్ చేసిందో మనందరికీ తెలుసు. ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ మైండ్ బ్లాక్ అయ్యే పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఆ సాంగ్ వైరల్ అవుతున్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో నటుడు అన్నూ కపూర్ పాల్గొన్నాడు. ఒక సీనియర్ నటుడిగా ఆ పాటలో ఆమె డ్యాన్స్ గురించి , పెర్ఫార్మెన్స్ గురించి లేదా ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడాల్సింది పోయి ఆమె దేహ ఆకృతి గురించి అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడారు. తమన్నాను ఉద్దేశించి ఆయన దూధియా బదన్...పాలలాంటి తెల్లని శరీరం అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్, విమర్శల వర్షం మొదలైంది. ఒక స్టార్ హీరోయిన్ టాలెంట్, ఆమె ఇన్నేళ్ల కష్టాన్ని, పెర్ఫార్మెన్స్ను పక్కనపెట్టి, కేవలం ఆమె బాడీని, రంగును, లుక్స్ ను ఒక సీనియర్ నటుడు ఆబ్జెక్టిఫై చేస్తూ ఇలాంటి చౌకబారు కామెంట్స్ చేయడం ఏంటని నెటిజన్లు అన్నూ కపూర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి అంటూ సోషల్ మీడియాలో క్లాస్ పీకారు. వివాదం ముదిరిపోవడంతో, 2026 జూలైలో అన్నూ కపూర్ ఈ విషయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను హిందీ భాషలో వాడిన పదాలను ఇంగ్లీష్‌లోకి తప్పుగా అనువదించడం వల్లే ప్రజల స్పందన వేరుగా ఉందని ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యల వల్ల తమన్నా నిజంగా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన పేర్కొన్నారు.



