మెగా డాటర్ కొత్త సినిమా…సూపర్ కాన్సెప్ట్ మమూలుగా…మరో బ్లాక్‌బస్టర్ షురూ

మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగా కంటే నిర్మాతగానే తనకంటూ ఒక సాలిడ్ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తున్నారు. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ గా నిలిచిందో మనందరికీ తెలిసిందే. ఆ సక్సెస్ ఇచ్చిన జోష్ తో నిహారిక ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజా ఈ చిత్రానికి అదిరిపోయే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల నేతృత్వంలోని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం పాకెట్ రాకెట్స్ . జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిర్మాణం నుంచి వస్తున్న ఫిల్మ్ కావడంతో టాలీవుడ్లో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక చాలా ఫ్రెష్ గా, అంతే పవర్ ఫుల్ గా ఉంది. కమిటీ కుర్రోళ్లు చిత్రంలో తన నేచురల్ నటనతో మెప్పించిన యువ నటుడు త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ ఇందులో ప్రధాన కథానాయకులుగా నటిస్తున్నారు. శుభం ఫేమ్ శ్రియా కొంతం ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు అతిపెద్ద ఆకర్షణ, బ్యాక్ బోన్ టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి. విలక్షణ పాత్రలతో అలరించే ఆయన ఈ గ్యాంబ్లింగ్ డ్రామాలో ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ నటులు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ విజువల్స్ ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి. గ్యానీ సంగీతాన్ని సమకూరుస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్‌గా, విష్ణు వర్దన్ పుల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి హడావిడి చేయకుండా, సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. నేటి యూత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ పాకెట్ రాకెట్స్ కచ్చితంగా ప్రేక్షకులకు ఒక కొత్త థ్రిల్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



