భారత్ దెబ్బకు విలవిల..నీటి కోసం పాక్ ప్రధాని కొత్త రాగం..!

ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి సింధూ జలాల అంశంలో భారత్ తీసుకున్న ఒకే ఒక్క కఠిన నిర్ణయంతో పాకిస్థాన్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. నేరుగా భారత్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని పాకిస్థాన్ ఇప్పుడు దొంగ దారిలో దౌత్య కుట్రలకు తెరతీసింది. టర్కీలోని అంటాల్యా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వాతావరణ మార్పుల సదస్సు COP31 అంతర్జాతీయ సమ్మిట్‌లో.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గ్లోబల్ లీడర్ల ముందు మొరపెట్టుకున్నారు. ప్రపంచ దేశాల అధినేతల ముందు సింధూ జలాల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సదస్సులో నేరుగా భారత్ పేరు ప్రస్తావించకుండానే తన ఏడుపునంతా వెళ్లగక్కారు. దేశాల మధ్య ఉన్న నీటి పంపిణీ ఒప్పందాలను కచ్చితంగా గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. నీటిని ఒక ఆయుధంగా వాడకూడదని, భౌగోళిక లేదా రాజకీయ ప్రయోజనాల కోసం దిగువన ఉన్న దేశాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఆయన భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక పాకిస్థాన్ దివాళా తీసిన ఆర్థిక పరిస్థితి ఆయన మాటల్లోనే స్పష్టంగా కనిపించింది. వాతావరణ మార్పుల వల్ల పాకిస్థాన్ లాంటి దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. అయితే ఇక్కడ షరీఫ్ వేసిన బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఆ సహాయాన్ని అప్పుల రూపంలో కాకుండా ఉచిత గ్రాంట్స్ రూపంలో ఇవ్వాలని ఆయన ప్రపంచ దేశాలను బతిమాలుకున్నారు. అప్పు ఇస్తే తిరిగి కట్టే స్థోమత పాకిస్థాన్‌కు లేదని ఆయన స్వయంగా ప్రపంచం ముందు ఒప్పుకున్నట్లయింది.
గతేడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్ ఉగ్రవాదులే కారణమని తేలడంతో.. భారత్ తన ప్రతీకారాన్ని అత్యంత కఠినంగా తీర్చుకుంది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో మన బలగాలు ఏకంగా 9 కీలక ఉగ్ర స్థావరాలను మట్టికరిపించి, వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. మిలిటరీ యాక్షన్ తర్వాత భారత్ అక్కడితో ఆగలేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి మన నీళ్లు ఎందుకు ఇవ్వాలి? అన్న కఠినమైన నిర్ణయంతో సింధూ జలాల పంపిణీని నిలిపివేసింది. ఉగ్రవాదం, నీరు ఒకేసారి పారలేవు అన్న విధానంతో భారత్ తీసుకున్న ఈ డెసిషన్‌తో పాకిస్థాన్‌లో వ్యవసాయం కుప్పకూలిపోయింది. అప్పటినుంచి పాక్ ప్రధాని ఎక్కడ ఇంటర్నేషనల్ మీటింగ్ జరిగినా అక్కడికెళ్లి ఇదే ఏడుపు కంటిన్యూ చేస్తున్నారు.



