మాటల మాంత్రికుడి మ్యాజిక్ మిస్సయిందా? వెంకీ-అనిల్ రావిపూడి వైపు ప్రేక్షకుల చూపు

టాలీవుడ్ లో విక్టరీ అనే పదం ఇంటిపేరుగా మార్చుకున్న ఏకైక హీరో వెంకటేష్ . ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకున్న క్రేజ్, ఫాలోయింగ్ ఏ స్టార్ హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు హిట్లు కొట్టిన ఈ సీనియర్ స్టార్ హీరోకు.. ఇప్పుడు సరైన సక్సెస్ రావాలంటే ఒక రేంజ్ లో కష్టపడాల్సి వస్తోంది. ఎంతలా అంటే, వెంకటేష్ కెరీర్ లో ఇప్పుడు హిట్ పడాలంటే కేవలం ఒకే ఒక డైరెక్టర్ పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ డైరెక్టరే అనిల్ రావిపూడి.
వెంకటేష్ కెరీర్ గ్రాఫ్ ను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే గత 12 ఏళ్లలో విక్టరీ వెంకటేష్ నటించిన 15 సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అందులో సోలో హీరోగా చేసిన ప్రయోగాలు, రీమేకులు చాలానే ఉన్నాయి. కానీ కమర్షియల్ గా, బాక్సాఫీస్ పరంగా ఆయనకు గ్రాండ్ సక్సెస్ అందించిన సినిమాలు మాత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్-2 , ఎఫ్-3, సంక్రాంతికి వస్తున్నాం వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయన చేసిన ఒక స్పెషల్ క్యామియో రోల్. మన శంకరవరప్రసాద్ గారు అనే ఆ సినిమాలో వెంకీ అతిథి పాత్రలో మెరిసి తన మార్క్ చూపించారు. ఈ మూడు మినహాయిస్తే, మిగిలిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. వాటిలో పరాజయాల శాతమే చాలా ఎక్కువ. అంటే ఈ పన్నెండేళ్లలో వెంకీకి ఒక కంప్లీట్ థియేట్రికల్ సక్సెస్ ఫార్ములాను సెట్ చేసింది కేవలం అనిల్ రావిపూడి మాత్రమే అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నటి వరకు వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండేవి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ మ్యాజిక్ చేస్తాడని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ తీరా చూస్తే వీరిద్దరి కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఆదర్శ కుటుంబం - హౌస్ నంబర్ 47 నిరాశపరిచిందని పబ్లిక్ టాక్ లో తేలిపోయింది. ఇక ఇప్పటి వరకు అనిల్ తెరకెక్కించిన 9 చిత్రాలలో వెంకటేశ్ మూడు చిత్రాల్లో భాగమయ్యారు. దీంతో ఇటు ఫ్యాన్స్, అటు ట్రేడ్ వర్గాల ఫోకస్ మొత్తం ఇప్పుడు వెంకటేష్-అనిల్ రావిపూడిల కొత్త సినిమా జనవరి 12 విడుదల పైకి మళ్లింది. బాక్సాఫీస్ వద్ద ఉన్న ఈ నెగెటివ్ వైబ్ ను బ్రేక్ చేయడానికి జనవరి 12 విడుదల శరవేగంగా ముస్తాబవుతోంది. కేవలం వెంకటేష్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మరో హీరోగా నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇందులో వెంకీకి జోడీగా మహానటి కీర్తి సురేశ్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ జంటగా కృతి శెట్టి జతకట్టనుంది. సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి సినిమాల ట్రాక్ రికార్డ్ ఎప్పుడూ అదిరిపోతుంది. కాబట్టి ఈ పొంగల్ రేసులో కూడా ఈ సినిమా దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ లో అనిల్ రావిపూడికి కేవలం వెంకటేష్ మాత్రమే కాదు, మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ లాంటి ఇతర స్టార్స్ తో కూడా బంపర్ హిట్స్ కొట్టిన ట్రాక్ రికార్డ్ ఉంది.



