యూరప్ ట్రిప్ టూ యాక్షన్ మోడ్..ఫౌజీ నెక్స్ట్ లెవెల్ అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్స్. ఫౌజీ, కల్కి 2, స్పిరిట్, సలార్ 2 ఇలా ఒకేసారి మూడు నాలుగు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టి ఫ్యాన్స్ కు జోష్ ఇస్తున్నారు. ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఆయన ఇటీవల ఒక చిన్న బ్రేక్ తీసుకుని యూరప్ వెకేషన్ కు వెళ్లారు. అయితే ఈ వెకేషన్ నుంచి తిరిగి రాగానే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అదే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ . ఆయన చేయబోయే ఆ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉండబోతోంది అనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిప్తోంది. ఫౌజీ సినిమాతో పాటు కల్కి 2, స్పిరిట్, సలార్ 2 షూటింగ్స్ ను కూడా లైనప్ లో పెట్టి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నారు.
సీతా రామం లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ తరువాత డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ తో ఈ సినిమా మునుపెన్నడూ చూడని ఒక భారీ యాక్షన్ విజువల్ ఫీస్ట్ అని హను ముందే హింట్ ఇచ్చేశారు. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ఒక గూఢచారి సైనికుడుగా నటిస్తున్నారని గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కథ ఇది అని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో సోషల్ మీడియా సెన్సేషన్, బ్యూటిఫుల్ డాన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ కు అప్పుడే మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాదు, ఈ పాన్ ఇండియా చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భాను చందర్ లాంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమాను గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ల సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఒకప్పుడు ప్రభాస్ సినిమా రావాలంటే మూడేళ్లు, నాలుగేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వరుసగా సినిమాలు దూసుకుపోతున్నాయి. నాగ్ అశ్విన్ తో చేయబోయే బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ కల్కి 2, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోయే పవర్ ఫుల్ కాప్ డ్రామా స్పిరిట్, అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2 - శౌర్యాంగ పర్వం.. ఇలా ఈ చిత్రాల చిత్రీకరణలతోనూ ప్రభాస్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీటిలో సలార్ 2 సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి.. ఏమాత్రం రెస్ట్ లేకుండా పాన్ ఇండియా ఆడియన్స్ కు పూనకాలు తెప్పించడానికి రెబల్ స్టార్ రెడీ అయిపోయారు.



