‘రాకా’పై యుద్ధం ఎఫెక్ట్ ..!అట్లీ సేఫ్ గేమ్ ముంబై నుండి హైదరాబాద్ కు..!

పుష్ప 2 లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కమర్షియల్ మాస్ డైరెక్టర్ అట్లీతో రాకా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా కోసం బన్నీ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. దాదాపు ఏడాదిన్నరగా ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్లో నిమగ్నమైన బన్నీ తన బెస్ట్ ఇవ్వడానికి కృషి చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ భాగం చిత్రీకరణ ముంబైలో జరుగుతుండటంతో.. హైదరాబాద్, ముంబై నగరాల మధ్య బన్నీ నిరంతరం రాకపోకలు సాగిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బన్నీ ఎయిర్‌పోర్టుల్లోనే ఎక్కువగా దర్శనమిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాకా నుంచి ఒక రాకింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ చివరి దశకు చేరుకుంది. ఈ షెడ్యూల్ ముగియగానే చిత్ర యూనిట్ మొత్తం అక్కడినుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ కానుంది. కథ ప్రకారం సినిమాలో ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్ రాబోతోంది. దీనికోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ యాక్షన్ పార్ట్‌ను ముందుగా దుబాయ్‌లో ప్లాన్ చేశారు. కానీ అక్కడ నెలకొన్న తీవ్రమైన ఎండల కారణంగా, అలాగే మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రిస్క్ ఎందుకని భావించిన అట్లీ.. ఆ షూటింగ్‌ను హైదరాబాద్‌కు మార్చినట్లు సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించనున్నారు. ఈ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, మిగిలిన ప్రధాన సన్నివేశాలు , పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ యూరప్ లేదా ఇతర విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సౌత్ లోనే నంబర్ వన్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఇది ఒకటిగా నిలవబోతోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇందులో బన్నీ డ్యుయల్ రోల్ చేస్తున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబై, హైదరాబాద్ షెడ్యూల్స్ తో కలిపి ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు 40 నుంచి 50 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక రాకా సినిమా రిలీజ్ డేట్ గురించి అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. మేకర్స్ ప్రణాళిక ప్రకారం, వచ్చే ఏడాది వేసవి నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత భారీ వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేసుకుని 2027 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో షూటింగ్, సీజీ పనులు ముగిసిన తర్వాతే ఒక పక్కా రిలీజ్ డేట్ ను ప్లాన్ చేయాలని నిర్ణయించారు.



