40 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజాల భారీ మల్టీస్టారర్.. పారితోషకాలకే అన్ని వందల కోట్లా..? బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం

లెజెండరీ దర్శకుడు కె.బాలచందర్ గారి శిష్యులుగా కెరీర్ ప్రారంభించి, ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో కలిసి నటించిన దిగ్గజ నటులు కమల్ హాసన్, రజనీ కాంత్ లు దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక భారీ మల్టీస్టారర్ కోసం చేతులు కలపబోతున్నారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు KHXRK అనే వర్కింగ్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పుడు ఒక మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక భారీ పాన్ ఇండియా సినిమా తీయాలంటే 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ అవుతుంది. కానీ ఈ KHXRK సినిమాను ఏకంగా 800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బడ్జెట్ లో సగానికి పైగా వాటా కేవలం ముగ్గురు వ్యక్తుల జేబుల్లోకే వెళ్లనుందట. ముందుగా మన సూపర్ స్టార్ రజనీకాంత్ విషయానికి వస్తే, జైలర్ సిరీస్ తో ఆయన మార్కెట్ మళ్లీ పీక్స్ కి చేరుకుంది. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లో నటించేందుకు రజనీకాంత్ ఏకంగా 200 కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక విక్రమ్, కల్కి సినిమాలతో తన విశ్వరూపం చూపిస్తున్న లోకనాయకుడు కమల్ హాసన్ కూడా రజనీకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా కోసం 200 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఈ ఇద్దరు హీరోలకే కలిపి 400 కోట్లు.
ఇక ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీస్ట్ సినిమా ప్లాప్ అయినా, జైలర్ 1,2 తో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చిన నెల్సన్ కు ఇప్పుడు డిమాండ్ మామూలుగా లేదు. రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జైలర్ 2 కోసం నెల్సన్ 60 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. అలాంటిది ఇప్పుడు రజనీ-కమల్ కాంబినేషన్ ను హ్యాండిల్ చేసే బాధ్యత తీసుకోవడంతో, ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నారని గట్టి టాక్ నడుస్తోంది. అంటే హీరోలకు 400 కోట్లు, డైరెక్టర్ కు 100 కోట్లు.. మొత్తం ఈ ముగ్గురికే 500 కోట్లు అవుతోందన్నమాట. ఇండియన్ సినిమా చరిత్రలో ఒక డైరెక్టర్ ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి కావచ్చు.మొత్తం 800 కోట్ల బడ్జెట్ లో 500 కోట్లు రెమ్యునరేషన్స్ కే పోతే, ఇక సినిమా మేకింగ్ కు మిగిలేది 300 కోట్లు మాత్రమే. ఈ 300 కోట్లు దేనికంటే.. ఇతర నటీనటులు, హీరోయిన్లు, విలన్స్ పారితోషికాలు, టెక్నికల్ టీమ్ కోసం ఈ బడ్జెట్ ను వినియోగించనున్నారు. నెల్సన్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కచ్చితంగా ఉండాల్సిందే. అనిరుధ్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగానే ఛార్జ్ చేస్తున్నాడు. అలాగే భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్, వరల్డ్ క్లాస్ వీఎఫ్ఎక్స్ , భారీ సెట్టింగులు, పబ్లిసిటీ.. వీటన్నిటికీ ఈ 300 కోట్లు ఖర్చు చేయనున్నారని సమాచారం. ఇద్దరు అతిపెద్ద స్టార్ హీరోలను పెట్టి యాక్షన్ సినిమా తీయాలంటే ఆ రేంజ్ బడ్జెట్ ఉండాల్సిందే. ఇదే నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా ఈ ప్రాజెక్ట్ నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



