ఎన్విడియా సీఈవోకు చైనా లేడీ స్పై ఎఫెక్ట్..ఎవరీ ఆలిస్ హువాంగ్?

ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్విడియా కంపెనీ సీఈవో జెన్సన్ హువాంగ్ ఒక అందమైన చైనీస్ లేడీ స్పై వలపు వలలో పడిపోయాడు. అమెరికా దేశ భద్రతకే ముప్పు తెచ్చేలా ఆమెతో సీక్రెట్ ఎఫైర్ నడిపి అడ్డంగా బుక్కయ్యాడు. అమెరికా విధించిన కఠినమైన ఎగుమతి ఆంక్షలను బురిడీ కొట్టించి, అత్యంత అధునాతన ఏఐ చిప్స్‌ను కొల్లగొట్టేందుకు చైనా ఇంటెలిజెన్స్ ఒక కిలాడీ లేడీని రంగంలోకి దించింది. అమెరికా నిఘా సంస్థల ఆరోపణల ప్రకారం ఆమె పేరే ఆలిస్ హువాంగ్ . ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈ స్పై స్కాండల్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఆలిస్ హువాంగ్. ఈమె అసలు పేరు హువాంగ్ లే . చైనా పౌరురాలైన ఈమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. చైనా బిజినెస్ ప్రొఫైల్స్ ప్రకారం, ఈమె మొదట చైనా ప్రభుత్వ ఛానెల్ సీసీటీవీలో , అలాగే హునాన్ టీవీలో రిపోర్టర్ గా పనిచేసింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ సెక్టార్ లోకి ఎంట్రీ ఇచ్చి, HSBC ప్రైవేట్ బ్యాంకింగ్ డివిజన్లో ప్రెసిడెంట్ అసిస్టెంట్ గా, ఆపై సిటిసిక్ సెక్యూరిటీస్‌లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసినట్లు ప్రొఫైల్స్ లో ఉంది అయితే ఆ సంస్థలు దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. చివరికి షాంఘై హెక్సీ ఇన్వెస్ట్మెంట్ లో ఫండ్ మేనేజర్ గా పనిచేస్తూ.. చైనీస్ గేమింగ్ కంపెనీ 7Road కి కనెక్ట్ అయింది. ఆ కంపెనీకి చెందిన సింగపూర్ బేస్డ్ డేటా సెంటర్ కంపెనీయే ఈ మెగాస్పీడ్. మార్చి 2023లో ఆలిస్ హువాంగ్ ఈ మెగాస్పీడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది. ఇక్కడే అసలు ఆట మొదలైంది. ఆమెను చైనా పౌర నిఘా సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పసిగట్టింది. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌కు, ఈ ఆలిస్ హువాంగ్‌కు ఎలాంటి బంధుత్వం లేదు. కానీ జూన్ 2024 నాటికి తైపీలోని ఒక ఈవెంట్ లో, బార్ లో జెన్సన్ హువాంగ్ పక్కన కూర్చుని ఈమె కనిపించింది. ఆ సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని, మెగాస్పీడ్ కంపెనీ ద్వారా అత్యంత భారీ ఎత్తున అడ్వాన్స్డ్ ఎన్విడియా ఏఐ ఎక్విప్మెంట్ను కొనుగోలు చేసింది. ఆ చిప్స్ అన్నీ ఆమె ద్వారా చైనాకు దొడ్డిదారిన వెళ్లాయనేది ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానం. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్ కదలికలపై అమెరికా నిఘా సంస్థలు కన్నేసి ఉంచాయి. సుమారు ఏడాదికి పైగా ఆమెను ట్రాక్ చేశాయి. ఆమె కాల్స్ ట్యాప్ చేస్తున్న సమయంలో.. ఆమె ఒక హై-ప్రొఫైల్ అమెరికన్ వీఐపీతో అత్యంత సన్నిహితంగా, రొమాంటిక్ గా మాట్లాడుతున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఆ మిస్టరీ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు నిఘా వర్గాలు విచారించగా, ఆ సీక్రెట్ వ్యక్తి మరెవరో కాదు.. సాక్షాత్తూ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ అని తేలడంతో అమెరికా ప్రభుత్వానికి మైండ్ బ్లాంక్ అయింది.



