ఒక్కడి కోసం నాగ్, చెర్రీ , ఎన్టీఆర్ ఎవరీ అనీష్ రెడ్డి ? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

ఇట్లు అర్జున సినిమా నవంబర్ 13న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో హీరోగా అనీష్ రెడ్డి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏంటంటే.. ఈ డెబ్యూ హీరో సినిమాకు టాలీవుడ్ బడా స్టార్లు ఇస్తున్న సపోర్ట్. ఏకంగా టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున, గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ రంగంలోకి దిగి ఈ సినిమాను ప్రమోట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇట్లు అర్జున సినిమాతో హీరోగా పరిచయమవుతున్న కుర్రాడి పేరు అనీష్. పూర్తిపేరు అనీష్ రెడ్డి. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మెన్ , ఏఎంఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి చిన్నకొడుకు. వ్యాపారవేత్త అయినప్పటికీ మహేశ్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి రిలేషన్స్ ఉన్నాయి . గతంలో నాగార్జున హీరోగా చేసిన శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ సినిమాలని ఈయనే ప్రొడ్యూజ్ చేశారు. అప్పటినుంచి నాగ్‌తో ఈయనకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అలా మహేశ్ రెడ్డి కొడుకు తొలి సినిమా కోసం నాగ్ తనవంతు సాయం చేస్తున్నారు. అనీష్ తొలి సినిమా ఇట్లు అర్జున కు నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా గ్లింప్స్‌కు కూడా నాగ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ట్రైలర్‌ని లాంచ్ చేసిన ఎన్టీఆర్‌కి కూడా మహేశ్ రెడ్డితో మంచి రిలేషన్ ఉంది. ఇక ఈ చిత్ర మ్యూజిక్ కన్సర్ట్కు తన కొడుకు అఖిల్‌తో కలిసి నాగార్జున వచ్చారు. వ్యాపార సంబంధాల దృష్ట్యానే టాలీవుడ్ ప్రముఖులతో అనీష్ కుటుంబానికి సంబంధాలున్నాయి. ఇదే పరిచయాల కారణంగానే రామ్‌చరణ్ కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు.
యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉన్న అనీష్, తనను తాను హీరోగా మలుచుకోవడానికి చాలా కష్టపడ్డాడు. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్‌తో జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒకప్పుడు అనీష్ చాలా బొద్దుగా, లావుగా ఉండేవాడు.. కానీ ఇప్పుడు ఫిజిక్ మార్చి ఒక హీరోలా తయారయ్యాడు అంటూ తారక్ ఆ కుర్రాడి డెడికేషన్‌ను మెచ్చుకున్నారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ రొమాంటిక్ డ్రామాలో అనీష్ ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇట్లు అర్జున ట్రైలర్‌ను చూస్తే.. అందులో అనీష్ యాక్షన్ సీక్వెన్స్‌లలో, డైలాగ్ డెలివరీలో ఒక మెచ్యూరిటీ కనిపిస్తోంది. కొత్త హీరో అయినా ఏమాత్రం తడబాటు లేకుండా కెమెరా ముందు కాన్ఫిడెంట్‌గా నిలబడ్డాడు అనీష్.ఈ సినిమాకు కేవలం పేరుకే సమర్పకుడిగా లేరు, ప్రమోషన్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. దీపావళి సందర్భంగా నాగార్జున స్వయంగా అనీష్, హీరోయిన్ అనశ్వర రాజన్, డైరెక్టర్ మహేష్‌లను ఇంటర్వ్యూ చేసి సినిమాపై బజ్ పెంచేశారు. ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న క్వాలిటీ, కంటెంట్ చూసే కింగ్ నాగార్జున దీనికి బ్యాకింగ్ ఇస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక దర్శకుడు వెంకీ కుడుముల గురించి మనకు తెలిసిందే.. ఛలో, భీష్మ లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఆయన, ఈ సినిమాతో నిర్మాతగా మారారు. ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్, నిర్మాతగా మారి ఒక కొత్త కుర్రాడిని లాంచ్ చేస్తున్నారంటే ఆ కథలో కచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో అనీష్ రెడ్డికి జోడీగా మలయాళ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ నటిస్తోంది. రీసెంట్గా తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ.. ఇట్లు అర్జునలో మంచి పాత్రలో సందడి చేయనుంది. ఇక ఈ యాక్షన్ రొమాంటిక్ డ్రామాకుమ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పెఇప్పటికే రిలీజ్ అయిన పాటలు యూట్యూబ్‌లో మంచి వ్యూస్ తెచ్చుకుంటున్నాయి.



