అనిరుధ్-కావ్య డెస్టినేషన్ వెడ్డింగ్.. గ్రీస్ లో పెళ్లి సంబరాలు
సౌత్ ఇండియాలో అత్యంత క్రేజ్ ఉన్న ఇద్దరు ప్రముఖులు ఒక్కటి కాబోతున్నారు. ఒకరు తన మ్యూజిక్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించే తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అయితే.. మరొకరు ఐపీఎల్ వస్తే చాలు టీవీ స్క్రీన్ల మీద నెటిజన్ల మనసు దోచేసుకునే సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్. వీరిద్దరి వివాహ వేడుకకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఈ జంట అత్యంత వైభవంగా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకుంది. ఆ దేశం మరేదో కాదు.. అందమైన సముద్ర తీరాలకు, పురాతన కట్టడాలకు పెట్టింది పేరైన గ్రీస్ .
గ్రీస్ దేశంలోని అత్యంత అందమైన శాంటోరిని ప్రాంతానికి సమీపంలో అనిరుధ్, కావ్య మారన్ల డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబాలకు చెందిన వీఐపీలను మాత్రమే ఆహ్వానించారు. అందులో ముఖ్యంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అనిరుధ్ స్వయానా రజినీకాంత్‌కు బంధువు అన్న విషయం తెలిసిందే. అలాగే తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తదితర అగ్రశ్రేణి రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనేందుకు గ్రీస్‌కు చేరుకున్నారు. అతిథులకు ఎలాంటి లోటు రాకుండా కళానిధి మారన్ స్వయంగా అన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వీఐపీ గెస్టుల కోసం ఇండియా నుంచి గ్రీస్‌కు ఏకంగా 4 ప్రైవేట్ విమానాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఫైవ్ స్టార్ హోటళ్లలో వసతి, రవాణా ఏర్పాట్లను మారన్ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకుంటోంది. సాధారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఇటలీ లేదా ఫ్రాన్స్ వైపు చూస్తుంటాయి. విరాట్ కోహ్లీ నుంచి దీపికా పదుకొనే వరకు అందరూ ఇటలీనే ఎంచుకున్నారు. కానీ కావ్య, అనిరుధ్ జంట మాత్రం గ్రీస్ దేశాన్ని లాక్ చేశారు. దీని వెనుక కొన్ని ప్రత్యేకమైన కారణాలున్నాయి. ట్రావెల్ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు గ్రీస్ ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ స్పాట్‌గా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం అక్కడి వాతావరణం. గ్రీస్‌లో ఏడాదిలో సుమారు 300 రోజుల పాటు ఎండతో కూడిన అత్యంత ఆహ్లాదకరమైన మధ్యధరా వాతావరణం ఉంటుంది. అంటే పెళ్లి కోసం భారీగా ఓపెన్ ఎయిర్ సెట్టింగ్స్ వేసినప్పుడు, వానలు పడి ఆటంకం కలుగుతుందన్న భయం ఇక్కడ అస్సలు ఉండదు. ఓపెన్ ఎయిర్ వెడ్డింగ్స్ , రిసెప్షన్లకు ఇది ఎంతో అనుకూలమైన దేశం. ఒకవైపు చల్లని సముద్రపు గాలి, మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు పర్ఫెక్ట్ మూడ్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక వాతావరణం తర్వాత గ్రీస్‌కు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ దాని అందం. పెళ్లి ఫొటోలు, వీడియోలు జీవితకాలం గుర్తిండిపోవాలంటే బ్యాక్‌డ్రాప్ అద్భుతంగా ఉండాలి. శాంటోరిని దీవుల్లోని సముద్రతీరాలు, ఎత్తైన కొండల మీద ఉండే చారిత్రక కట్టడాలు, ఒకే ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన తెల్లటి అందమైన భవనాలు.. వివాహ వేడుకలకు ఒక అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌ను అందిస్తాయి. ఫొటోగ్రాఫర్లకు ఇదొక స్వర్గం లాంటిది. వీటన్నింటికంటే ముఖ్యంగా గ్రీక్ సంస్కృతిలో ఒక అద్భుతమైన సంప్రదాయం ఉంది. అదే ఫిలోజెనియా . ఫిలోజెనియా అంటే మన భాషలో అతిథి దేవోభవ అని అర్థం. తమ ఇంటికి లేదా దేశానికి వచ్చే అతిథులను దేవుడిగా భావించి, వారికి అత్యుత్తమమైన ఆతిథ్యం ఇవ్వడాన్ని గ్రీక్ ప్రజలు ఒక పవిత్రమైన విధిగా భావిస్తారు. ఆ ఫిలోజెనియా ఆతిథ్యం, అక్కడికి వెళ్లే వీఐపీ గెస్టులందరికీ ఒక మరువలేని జీవితకాల అనుభూతిని ఇస్తుంది. అతిథుల గౌరవానికి మారన్ కుటుంబం ఇచ్చే ప్రాముఖ్యతకు, గ్రీక్ సంస్కృతికి కరెక్ట్‌గా సింక్ అయిందనే చెప్పాలి. గ్రీక్ దేశం డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ఫేమస్ అవ్వడానికి వాళ్ల ఆహారపు అలవాట్లు కూడా ఒక ప్రధాన కారణం. ఈ పెళ్లి వేడుకల్లో అతిథులకు అత్యంత ఖరీదైన గ్రీక్ వంటకాలను వడ్డించబోతున్నారు. ఈ రకంగా అనిరుధ్-కావ్య వెడ్డింగ్ ఫుడ్ మెనూ కూడా ఒక నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వబోతోంది.



